అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి.

అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది?

2024 United States Presidential Election Process (Photo Credit : Google)

Updated On : November 2, 2024 / 12:03 AM IST

US Election 2024 : అభ్యర్థుల బలాలు, బలహీనతల సంగతి ఎలా ఉన్నా.. అమెరికా ఎన్నికల ప్రక్రియలో కనిపించే కన్ ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోతారు, తక్కువ వచ్చినా గెలుస్తారు. ఇంతకీ అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది?

నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రెసిడెంట్ మాత్రం జనవరిలో బాధ్యతలు తీసుకుంటారు. ఈ టోటల్ ప్రాసెస్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓట్లు ఎక్కువ వచ్చినా గెలుస్తారని ఏమీ లేదు, తక్కువ ఓట్లు వచ్చిన వారు కూడా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంటుంది. అమెరికా చరిత్రలో అలా జరిగింది కూడా.

అమెరికాలో ప్రతి నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రకటన ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. అంతటి శక్తిమంతుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నిర్వహించే ప్రక్రియ అత్యంత పకడ్బందీగా ఉంటుంది. ఏ సంవత్సరంలో ఏ రోజున ఎన్నికలు నిర్వహించాలి? ఎప్పుడు ఫలితాలను ప్రకటించాలి? కొత్త అధ్యక్షుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి? ఇలాంటివన్నీ ముందే ఫిక్స్ చేస్తారు.

నవంబర్ లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజే ఎన్నికలు నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు. అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రిపబ్లిక్ పార్టీ, రెండు డెమోక్రటిక్ పార్టీ. రాష్ట్ర ప్రైమరీలు, కాకస్ ఓటింగ్ ద్వారా తమ పార్టీల తరపున ఎవరు పోటీ చేయాలో నిర్ణయిస్తారు. రిపబ్లిక్ పార్టీలో ట్రంప్ నకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనే అధ్యక్ష బరిలో ఉన్నారు. డెమోక్రటిక్ నుంచి కమలా హారిస్ పోటీలో ఉన్నారు. ఇంటింటి ప్రచారాలు, రోడ్లపై ర్యాలీలు, భారీ బహిరంగ సభలు ఉండవు. టీవీల్లోనే డిబేట్లు జరుగుతాయి. రెండు పార్టీల అభ్యర్థులు ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు చొప్పున 100 మంది సెనేటర్లు ఉంటారు. వాషింగ్టన్ లో ముగ్గురు ఉంటారు. మొత్తం 103 మంది ఉంటారు. వీళ్లు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీలో ఓటు వేసేందుకు 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. ఇవన్నీ కలిస్తే 538 ఎలక్టోరల్ ఓట్లన్న మాట.

అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. జనాలు డైరెక్ట్ గా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కు ఓట్లు వేయరు. ఓట్లు వేసేది ఈ ఎలక్టర్లకే. పాపులర్ ఓట్లు.. అంటే జనాలు డైరెక్ట్ గా వేసే ఓట్లు ఎక్కువగా వచ్చినంత మాత్రాన విజయం సాధించలేము. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు.

 

Also Read : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ నాలుగు జాతులు ఎవరివైపు? ఎవరికి జై కొట్టబోతున్నారు?