అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ నాలుగు జాతులు ఎవరివైపు? ఎవరికి జై కొట్టబోతున్నారు?

అయితే ఈసారి మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతోంది. అమెరికాలో దాదాపు 52 లక్షల మంది భారతీయులు ఉండగా.. 26 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ నాలుగు జాతులు ఎవరివైపు? ఎవరికి జై కొట్టబోతున్నారు?

Updated On : November 1, 2024 / 11:02 PM IST

US Election 2024 : కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. పెద్దన్నకు పెదరాయుడు ఎవరో తేల్చే ఘట్టం మొదలు కావడానికి. ప్రపంచం ఆసక్తి అంతా ఇప్పుడు అమెరికా మీదే. ఎన్నికలు జరిగేది అక్కడైనా.. హీట్ మాత్రం ప్రతి దేశంలో కనిపిస్తోంది. అమెరికా రాజకీయాలు ప్రపంచ పాలిటిక్స్ ను డిసైడ్ చేస్తాయి. దీంతో ప్రతీ మూమెంట్ ను అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తాయి. ఇంతకీ అమెరికా ఎన్నికల్లో ఎవరు ఎటువైపు? ఆ నాలుగు జాతులు ఎవరివైపు మొగ్గు చూపుతున్నాయి? అమెరికా పొలిటికల్ పిక్చర్ చెబుతున్నది ఏంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం ఇంకొన్ని గంటల్లో మొదలుకాబోతోంది. ప్రాంతాలు వేరేమో కానీ..రాజకీయం ఒక్కటే ఒకేలా ఉంటుందని ట్రంప్, హారిస్ ప్రచారం ప్రూవ్ చేసింది. తూటాల్లా పేలిన మాటలు, కమ్ముకున్న ఆరోపణలు.. నెల రోజులుగా రాజకీయాల్లో కనిపించిన మంటలు అన్నీ ఇన్నీ కావు. ముందస్తు ఓటింగ్ లో భాగంగా ఇప్పటికే 6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయగా, మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.

ఇప్పటివరకు బయటకు వచ్చిన సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఒక్క శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. జార్జియా, నార్త్ కరోలినాలో ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు కనిపిస్తుంది. జార్జియాలో ట్రంప్ కు 48శాతం, హారిస్ కు 47శాతం మద్దతుగా ఉన్నారు. నార్త్ కరోలినాలో హారిస్ కు 48 శాతం, ట్రంప్ నకు 47 శాతం మంది ఓటర్లు మద్దుతుగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

అమెరికా ఎన్నికలు అంటే ఆ ఒక్క దేశానికి మాత్రమే పరిమితమైన ఎలక్షన్స్ కావు. యూఎస్ లో చాలా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లూ ఉంటారు. 41శాతం మంది ఓటర్లు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్లే. అమెరికా శ్వేత జాతీయులు 59శాతం మంది ఉన్నారు. వీళ్లంతా రిపబ్లికన్స్ వైపే ఉంటారు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని ట్రంప్ స్టాండ్ తీసుకోవడంతో ఈసారి శ్వేత జాతీయుల ఓట్లు రిపబ్లిక్ పార్టీకే పడే ఛాన్స్ ఉంది.

అయితే మిగతా 41శాతం ఉన్న 4 జాతులు కీలకంగా మారాయి. వీళ్లు ఎటువైపు ఉంటారు అనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ఆఫ్రో అమెరికన్లు, స్పానిష్ మాట్లాడే హిస్పానియన్లు, ఏషియన్లు అమెరికా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. క్లియర్ గా చెప్పాలంటే వీళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. శ్వేత జాతీయుల తర్వాత అమెరికాలో హిస్పానియన్లు ఎక్కువ. వీళ్లు లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఎక్కువగా స్పానిష్ మాట్లాడతారు. యూఎస్ జనాభాలో 19.1 శాతం ఉన్నారు. దీంతో వీరి ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. డెమోక్రాట్ పార్టీ ఓట్లలో సుమారు 12 శాతం వీరివే ఉంటాయన్నది ఓ లెక్క.

హిస్పానియన్ల తర్వాత అధిక సంఖ్యలో ఉండేది ఆఫ్రో అమెరికన్లు. శతాబ్దాల కిందట ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి వారసులైన వీరు.. ఇప్పటికీ జాతి వివక్షపై ఆందోళన చేస్తుంటారు. దేశ జనాభాలో వీరి వాటా 12.6 శాతం కాగా..వీరు డెమోక్రాట్లకు భారీగా మద్దతు ఇస్తారు. డెమోక్రాట్ ఓటర్లలో 17 శాతం వీళ్లే ఉంటారు. ఇక ఆసియా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఏషియన్ అమెరికన్ ఓటర్లు యూఎస్ జనాభాలో 6.1శాతంగా ఉన్నారు. గత 15 ఏళ్లుగా అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న వర్గం ఆసియా దేశాల వారే.

ఇండియా నుంచి వచ్చిన వారే 26 లక్షల మంది వరకు ఉన్నారు. యూఎస్ రాజకీయాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయ నేతలుగా, అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధులు సేకరించే వారిగా ఇలా అనేక అంశాల్లో మనోళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా మనోళ్లంతా డెమోక్రాట్ల వైపే మొగ్గు చూపుతారు.

అయితే ఈసారి మాత్రం సీన్ కాస్త రివర్స్ అవుతోంది. అమెరికాలో దాదాపు 52 లక్షల మంది భారతీయులు ఉండగా.. 26 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 61శాతం మంది భారతీయ అమెరికన్లు కమలా హారిస్ వైపే ఉన్నారని సర్వేలో తేలింది. ట్రంప్ నకు 31శాతం మంది మద్దతు ఉందని తెలిపింది. అయితే 2020తో పోలిస్తే రిపబ్లికన్ అభ్యర్థికి భారతీయ అమెరికన్ల మద్దతు 22 శాతం నుంచి 31 శాతానికి పెరగడం డెమోక్రాట్లను ఆందోళనకు గురి చేస్తోంది.

 

Also Read : హారిస్ వర్సెస్ ట్రంప్ లేటెస్ట్ పోల్స్ : అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే?