ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 30ఏళ్ల స్నేహం ఎందుకు చెడింది? ఈస్థాయిలో శత్రుత్వానికి కారణమేంటి?

ఒకప్పుడు ఒకరికి ఒకరు అండగా ఉన్న దేశాలు.. కత్తులు దూసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది.

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 30ఏళ్ల స్నేహం ఎందుకు చెడింది? ఈస్థాయిలో శత్రుత్వానికి కారణమేంటి?

Updated On : October 4, 2024 / 11:38 PM IST

Iran Vs Israel : గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్లతోనే. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వేళ వినిపిస్తున్న మాట ఇదే. 30ఏళ్ల స్నేహం శత్రుత్వంగా మారితే ఆ హింస, రక్తపాతం ఎలా ఉంటుందో ప్రపంచం చూస్తోంది. ప్రపంచం గుర్తించని ఇజ్రాయెల్ కు ఇరాన్ అండగా నిలిస్తే.. కలిసి గెలుద్దాం అని ఇరాన్ చేతిలో చెయ్యి వేసింది ఇజ్రాయెల్. ఇలాంటి అద్భుతమైన స్నేహితులు ఇప్పుడు శత్రువులుగా మారారు. రియల్ లైఫ్ సలార్ అనిపిస్తున్నారు. ఇంతకీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏం జరిగింది? వాళ్ల స్నేహం ఎలా ఉండేది. ఇప్పుడు ఈ యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది?

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచమే భయపడేలా చేస్తోంది. వార్ ముదిరితే ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి వరల్డ్ వార్ వస్తుందేమో అనే భయమే ఇప్పుడు ప్రతీ ఒక్కరిని టెన్షన్ పెడుతోంది. ఒకప్పుడు ఒకరికి ఒకరు అండగా ఉన్న దేశాలు.. కత్తులు దూసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ స్థాయిలో శత్రుత్వానికి కారణాలు ఏంటి? ఈ ఇద్దరి మధ్య వైరం ఇప్పట్లో తీరే అవకాశం ఉందా?

స్నేహితులను చేసిన నినాదమే.. రెండు దేశాలను శత్రువులుగా మార్చిందా? ఇరాన్, ఇజ్రాయెల్ శత్రుత్వానికి ముగింపే లేదా? ఇరాన్, ఇజ్రాయెల్ స్నేహాన్ని ఓ విప్లవం దెబ్బతీసింది. దీంతో 1948లో మొదలైన రెండుదేశాల స్నేహానికి 30 ఏళ్ల తర్వాత బీటలు రావడం మొదలయ్యాయి. అప్పట్లో అమెరికాతో జతకట్టిన పహ్లావి రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది.

ఆ తర్వాత ఇరాన్ పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం..అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోయింది. దీంతో ఇజ్రాయెల్, అమెరికాలు, ఆ దేశానికి దూరమయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్ ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. అమెరికాను మహా సైతాన్, ఇజ్రాయెల్ చిన్న సైతాను అంటూ ఇరాన్ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టింది.

అక్కడ మొదలైన విబేధాలు ఆ తర్వాత ముదురుతూనే వచ్చాయి. 1990 ప్రారంభం నాటికి ఇరాన్, ఇజ్రాయల్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిడిల్ ఈస్ట్ లో అరబ్ సోషలిజం, సోవియట్ యూనియన్ ఇన్ ఫ్లూయెన్స్, ఇరాక్ ప్రమాదం తగ్గిపోయాయి. దీంతో రెండు దేశాలు తమ స్నేహంలో లాభనష్టాలు లెక్కలు వేసుకోవడం స్టార్ట్ చేశాయి. 30ఏళ్లు విలువలు మాట్లాడిన దేశాలు.. ఆ తర్వాత లెక్కలు మాట్లాడుకున్నాయి. అక్కడ మొదలైన పంతం పూర్తిగా బ్రేకప్ అయ్యింది.

 

Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమేనా? ఇక వినాశమేనా?