Isckon
ISKCON in Ukraine: గత ఐదు రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా యుక్రెయిన్ దేశంలో పరిస్థితులు మరింత క్షిణిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ దేశం వదిలి వెళ్లిపోతున్నారు. కనీసం తిండి కూడా దొరకని పరిస్థితుల్లో సరిహద్దులు దాటుకుంటూ పక్కనే ఉన్న దేశాలకు వలస వెళుతున్నారు యుక్రెయిన్ లోని ప్రజలు. ఈక్రమంలో దేశం ధాటి వస్తున్న ప్రజలకు సహాయం అందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ముందుకువచ్చింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ప్రతినిధుల బృందం.. యుక్రెయిన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పలు దేశాల సరిహద్దుల వద్ద శరణార్ధులకు అన్నపానీయాలు అందిస్తూ సహాయం చేస్తున్నారు.
Also read: PM Modi on Ukraine Crisis: రష్యాపై యుక్రెయిన్ యుద్ధం.. భారతీయుల కోసం మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
భారత రాయబార కార్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు.. యుక్రెయిన్ – హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న శరణార్ధులకు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆశ్రయం కల్పించారు. ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మాట్లాడుతూ.. “యుక్రెయిన్ లో మొత్తం 54 ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి..ఆయా కేంద్రాల నుంచి అనేకమంది ప్రతినిధులు ఈ సహాయచర్యల్లో పాల్గొంటున్నారు, ప్రస్తుతం హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న వారికోసం రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని” తెలిపారు. ఒకవేళ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చినా.. ప్రజల ఆకలి తీర్చేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని రాధారామన్ దాస్ తెలిపారు.
యుద్ధం కారణంగా ఆకలితో బాధపడే వారు సమీపంలోని ఇస్కాన్ కేంద్రానికి చేరుకోవాలని సూచించిన రాధారామన్ దాస్..ఆయా కేంద్రాలకు సంబంధించి లొకేషన్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇస్కాన్ తో పాటుగా మరికొన్ని భారతీయ స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు యుక్రెయిన్ లో యుద్ధ బాధితులకు సహాయం చేస్తున్నాయి. మరోవైపు యుక్రెయిన్ ధాటి పోలాండ్, హంగేరీ, రోమానియా దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ “ఆపరేషన్ గంగ” కొనసాగుతుంది.
ISKCON has over 54 temples in Ukraine & our devotees & temples r committed to serve those in distress. Our doors r open for service. Hare Krishna!
To find nearest temples near you, please visit.https://t.co/iFnZQaPoqG pic.twitter.com/zlUGF84X9f
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) February 26, 2022
Photographs of @ISKCON members distributing fresh food and water for stranded Indian Nationals who crossed over from Ukraine to Hungary. This is a wonderful gesture in the time of such war and crisis. ISKCON has a huge network across the globe and Ukraine as well. ? pic.twitter.com/PBbIlBSbeD
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 27, 2022