ఇజ్రాయెల్, గాజా మధ్య ఎందుకు ఇన్ని దాడులు? చరిత్ర ఏం చెబుతోంది?

ఆ భూభాగంలో ఆ రెండు వర్గాలకు చెందిన వారి పవిత్ర స్థలాలు ఉండడం, రెండు వర్గాల వారూ ఈ ప్రాంతం కోసం పోరాడుతుండడంతో..

గాజా యుద్ధం.. క్షిపణులతో ఇజ్రాయెల్‌ దాడులు.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి.. గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఇటువంటి వాక్యాలను చాలా కాలంగా వింటూనే ఉన్నాం. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ కూడా దాడి చేయడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా? అన్న భయాలు నెలకొన్నాయి.

ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్‌ కూడా సిద్ధమైందన్న సూచనలు కనపడుతున్నాయి. అసలు ఈ దాడులు ఇంత తీవ్రంగా ఎందుకు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో నెలకొన్న ఈ అతి సంక్లిష్ట సమస్యకు కారణమేంటి? యుద్ధం ఎలా మొదలైంది? అసలు ఇన్ని దాడులు ఎందుకు చేసుకుంటున్నారు?

1948కి ముందు ఏం జరిగింది?
అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. మధ్యప్రాచ్యంలోని ఓ భూభాగాన్ని పాలించిన ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయింది. పాలస్తీనా అని ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. దాన్ని అప్పట్లో బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో యూదులు మైనారిటీలుగా, అరబ్‌లు మెజారిటీగా, ఇతర చిన్న జాతులు కూడా నివసించేవి.

అయితే, యూదుల కోసం పాలస్తీనాలో ‘నేషనల్ హోం’ ఏర్పాటు చేసే పనిని అంతర్జాతీయ సమాజం యూకేకి బాధ్యత అప్పజెప్పింది. ఆ సమయంలో ఆ రెండు వర్గాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు.

ఆ ప్రాంతంపై తమకు మాత్రమే హక్కు ఉందని అంటుంది. మరోవైపు, పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ, యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో, మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమిని చవి చూసిన తరువాత ఆ ప్రాంతం బ్రిటన్ అధీనంలోకి వచ్చింది. 1920-1940 మధ్య యూరప్‌లోని వేధింపులకు గురైన వారు, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నాజీ పాల్పడిన వినాశనం కారణంగా అనేకమంది పారిపోవడంతో అక్కడకు వచ్చే యూదుల సంఖ్య పెరిగింది.

యూదులు, అరబ్బుల మధ్య, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హింస కూడా పెరిగింది. 1947లో, ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను రెండుగా విభజించి ప్రత్యేక యూదు, అరబ్ ప్రాంతాలుగా విభజించాలని ఓటు వేసింది. జెరూసలేం అంతర్జాతీయ నగరంగా మారింది. ఆ ప్రణాళికను యూదు నాయకులు అంగీకరించినప్పటికీ అరబ్ వైపువారు తిరస్కరించడంతో అది అమలు కాలేదు.1948లో బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిన అనంతరం యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు.

యూదులకు పాలస్తీనా వారి పూర్వీకుల నివాసం. అయితే, పాలస్తీనియన్ అరబ్బులు కూడా ఆ భూమి తమకు చెందుతుదని, పాలస్తీనా చర్యలను వ్యతిరేకించారు. 1948లో తొలిసారి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. 1967లో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం మరో కొత్త సమస్య ఉత్పన్నమైంది.

రెండు వర్గాలకు చెందిన పవిత్ర స్థలాలు అక్కడే
ఆ భూభాగంలో ఆ రెండు వర్గాలకు చెందిన వారి పవిత్ర స్థలాలు ఉండడం, రెండు వర్గాల వారూ ఈ ప్రాంతం కోసం పోరాడుతుండడంతో దాడులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని వదులుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. చివరకు చాలా కాలం తర్వాత 2002లో క్యాంప్ డేవిడ్‌లో మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. క్లోజ్డ్ డోర్ సదస్సు నిర్వహించారు.

అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్‌తో పాటు పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ తమ అభిప్రాయాల విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో ఆ సదస్సు విఫలమైంది. జెరూసలెం మొత్తం తమ రాజధాని అని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవిష్యత్తులో తమ పాలస్తీనా రాజ్యానికి రాజధాని అని అంటున్నారు. 50 ఏళ్లుగా ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో ఎన్నో నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాంతంలో 6 లక్షల మందికి పైగా యూదులు ఉంటున్నారు. అవన్నీ అక్రమంగా కట్టినవని పాలస్తీనా అంటోంది.

Israel and Hamas war: గాజాలో మసీదు, పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది పాలస్తీనియన్లు మృతి