Israeli Archaeologists: రోమన్ కాలం నాటి నాణెలతో బయటపడ్డ పురాతన నౌక

మెడిటరేనియన్ తీరంలో రెండు నౌకల అవశేషాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ బుధవారం ప్రకటించింది. ఆ నౌకల్లో వందల కొద్దీ రోమన్, మధ్యయుగం నాటి వెండి నాణేలు కోకొల్లలుగా...

Israeli Archaeologists: మెడిటరేనియన్ తీరంలో రెండు నౌకల అవశేషాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ బుధవారం ప్రకటించింది. ఆ నౌకల్లో వందల కొద్దీ రోమన్, మధ్యయుగం నాటి వెండి నాణేలు కోకొల్లలుగా ఉన్నట్లు తెలిసింది. పురాతన నగరం సిజేరియా సమీపంలో కనిపించిన నౌకలు.. రోమన్, మామ్లుక్ కాలానికి చెందినవిగా గుర్తించారు.

సుమారు 1,700 నుంచి 600 సంవత్సరాల క్రితం నాటివిగా పురావస్తు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. వాటిలో మూడో శతాబ్దం మధ్యకాలం నాటి వందలాది రోమన్ లకు సంబంధించిన వెండి, కాంస్య నాణేలు, అలాగే వాటి అవక్షేపాల మధ్య మధ్యయుగం నాటి 500 కంటే ఎక్కువ వెండి నాణేలు ఉన్నాయి.

రెండు నెలలుగా IAA మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ నిర్వహించిన నీటి అడుగున సర్వేలో ఇవి బయటపడ్డాయని యూనిట్ హెడ్ జాకబ్ షర్విత్ తెలిపారు. పురాతన నగరమైన సిజేరియా సమీపంలోని సైట్ నుండి వెలికితీసిన ఇతర కళాఖండాలలో బొమ్మలు, గంటలు, సిరామిక్స్, లోహ కళాఖండాలు ఉన్నట్లు వెల్లడించారు.

rEAD aLSO : రౌడీ స్టార్ క్రేజ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరగదీస్తున్నాడు..

క్రిస్మస్‌కు కొద్ది రోజుల ముందు IAA చేసిన ప్రకటనలో రోమన్ బంగారు ఉంగరాన్ని కనుగొన్నట్లు చెప్పింది. భుజాలపై గొర్రెలను మోసుకెళ్ళే గొర్రెల కాపరి బొమ్మతో చెక్కబడిన ఆకారంలో ఆకుపచ్చ రత్నం పొదిగి ఉంది. ‘రత్నం మీద ‘మంచి కాపరి’ చిత్రం ఆధారంగా ఇది క్రైస్తవ మతం ప్రారంభ చిహ్నాలలో ఒకటి,” అని అతను అభిప్రాయపడ్డాడు.

కొన్ని కళాఖండాల శైలి ఆధారంగా రోమన్ నౌక మొదట ఇటలీకి చెందినదని నమ్ముతున్నట్లు షర్విత్ చెప్పారు. చెక్క నౌకల అవశేషాలు ఇసుక కింద చెక్కుచెదరకుండా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.

rEAD aLSO: బిగ్‌బాస్ జెస్సి హీరోగా ‘ఎర్రర్ 500’

ట్రెండింగ్ వార్తలు