Bigg Boss Jessie : బిగ్‌బాస్ జెస్సి హీరోగా ‘ఎర్రర్ 500’

తాజాగా జెస్సి హీరోగా సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ ని జెస్సి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నా మొదటి సినిమా పోస్టర్ 'ఎర్రర్ 500'ని లాంచ్ చేస్తున్నాను.

Bigg Boss Jessie : బిగ్‌బాస్ జెస్సి హీరోగా ‘ఎర్రర్ 500’

Biggboss Jessie

Bigg Boss Jessie :   బిగ్ బాస్ 5వ సీజన్ లో ఎక్కువ మందికి తెలియని వ్యక్తిగా హౌస్ లోకి అడుగు పెట్టాడు జెస్సి. మోడల్ గా చేసే జెస్సికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తన లైఫ్ మారిపోయింది. బిగ్ బాస్ లో షణ్ముఖ్, సిరిలతో కలిసి ఉండటంతో జెస్సికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆనారోగ్య సమస్యలతో జెస్సి మధ్యలోనే హౌస్ నుంచి బయటకి వచ్చేశాడు.

అందరి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాగే హౌస్ నుంచి బయటకి వచ్చాక హౌస్ లో సంపాదించిన పేరుని ఉపయోగించుకోడానికి ట్రై చేస్తున్నాడు జెస్సి. తాజాగా జెస్సి హీరోగా సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ ని జెస్సి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నా మొదటి సినిమా పోస్టర్ ‘ఎర్రర్ 500’ని లాంచ్ చేస్తున్నాను. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నాకు మీ ఆశీస్సులు కావాలి, మీ ప్రేమ మరియు మద్దతుతో నేను దీన్ని మొదలుపెడుతున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని మరింత అలరిస్తాను అని పోస్ట్ చేశాడు.

Akhanda : నరసింహుడి సన్నిధిలో ‘అఖండ’

హౌస్ నుంచి బయటకి రాగానే హీరోగా సినిమా అనౌన్స్ చేయడంతో అందరి కళ్ళు ఈ కంటెస్టెంట్ పైనే పడ్డాయి. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో, భవిష్యత్తులో జెస్సి ఇంకెంత ముందుకి వెళ్తాడో చూడాలి. మైత్రేయ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో సందీప్ మైత్రేయ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.