Israel: మరిన్ని దేశాలకు విస్తరిస్తున్న యుద్ధం.. సిరియాలోని విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడులు

డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై దాడులు జరిగాయి. ఆ ఎయిర్‌పోర్టులను మూసేశారు.

Damascus-airport

Syria: ఇజ్రాయెల్-గాజా యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హమాస్ కు మద్దతు ఇస్తున్నందుకు సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై దాడులు జరిగాయి. దీంతో ఆ విమానాశ్రయాలను అధికారులు మూసేశారు. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో డమాస్కస్, అలెప్పోలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం జరిగిందా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఆ రెండు విమానాశ్రయాలపై వ్యూహాత్మకంగా ఒకే సమయంలో ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది.

ఇజ్రాయెల్ సైన్యం-హమాస్ మధ్య ఆరో రోజు యుద్ధం కొనసాగుతోన్న వేళ సిరియాపై దాడులు జరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇవాళ ఇజ్రాయెల్ లో పర్యటించారు. తమ దేశం ఇజ్రాయెల్ కు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తోందని, అయితే, ప్రజలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.

 

Israel Hamas War : భీకరదాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్.. హమాస్ టన్నెల్, బంకర్ నెట్ వర్క్ లే టార్గెట్