Israel Hamas War : భీకరదాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్.. హమాస్ టన్నెల్, బంకర్ నెట్ వర్క్ లే టార్గెట్

స్మగ్లింగ్ కార్యకలాపాలు, కిడ్నాప్ చేసిన బందీలను దాచేందుకు కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా గాజాలోని హమాస్, ఇతర ఉగ్రసంస్థలు భూగర్భ సొరంగ నెట్‌వర్క్ ను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా గాజా హమాస్ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి ఇక్కడ కాంక్రీట్ వినియోగించి

Israel Hamas War : భీకరదాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్.. హమాస్ టన్నెల్, బంకర్ నెట్ వర్క్ లే టార్గెట్

Israel Hamas War

Updated On : October 12, 2023 / 12:00 PM IST

Israel Gaza Attack: గాజా గజగజ వణికిపోతుంది.. ఆ ప్రాంతంలో ఎటుచూసినా శిథిలమైన భవనాలు, కుప్పలుతెప్పలుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన గాజాలో దాడులను మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ సర్కార్ సిద్ధమైంది. గత శనివారం దేశంలోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులపై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. వందల మందిని బందీలుగా చేసుకొని వారిని అతిదారుణంగా చంపేశారు. తమ దేశంలోకి చొరబడి మారణహోమానికి పాల్పడిన హమాస్ ను భూస్థాపితం చేసేందుకు ఇజ్రాయెల్ సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. దాడులను మరింత ఉధృతం చేసింది. ముఖ్యంగా గాజాలో హమాస్ టన్నెల్, బంకర్ నెట్ వర్క్ లపై ఇజ్రాయెల్ గురిపెట్టి దాడులు చేస్తోంది. ఆ నెట్ వర్క్ ను ధ్వంసం చేసేలా వైమానిక దాడులు చేపడుతోంది. దీంతో గాజాలో అనేక భవనాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి.

Read Also : US War Ship USS Gerald R Ford : ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక వెరీ డేంజర్ గురూ

వారి ఉనికి భూమిపైనే లేకుండా చేస్తాం..
తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు హమాస్ కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. గాజాలో అతిత్వరలో క్షేత్రస్థాయిలో దాడులు చేపడతాం. హమాస్ గ్రూప్ ఉనికి ఈ భూమిపైనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రతి హమాస్ సభ్యుడు మూల్యం చెల్లించాల్సిందే. వారు అసలు మనుషులు కాదు. వారిని నలిపేస్తాం.. ఆ గ్రూపును నాశనం చేస్తాంఅంటూ నెతన్యాహు హెచ్చరికలు జారీచేశారు.

Read Also : Gaza Children: అర్ధరాత్రి తలలపై నుంచే రాకెట్లు వెళ్లాయి.. పిల్లలు భయంతో వణికిపోయారు.. ఇళ్లలోంచి పరిగెత్తి..: గాజా మహిళ

హమాస్ టన్నెల్, బంకర్ నెట్‌వర్క్ లే టార్గెట్ ..
స్మగ్లింగ్ కార్యకలాపాలు, కిడ్నాప్ చేసిన బందీలను దాచేందుకు కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకొనేలా గాజాలోని హమాస్, ఇతర ఉగ్రసంస్థలు భూగర్భ సొరంగ నెట్‌వర్క్ ను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా గాజా హమాస్ గుప్పిట్లోకి వెళ్లిన నాటి నుంచి ఇక్కడ కాంక్రీట్ వినియోగించి అండర్ గ్రౌండ్ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాలతో అనుసంధానించారు. వీటిని యుద్ధ విమానాలు, ఉపగ్రహాలకు దొరక్కుండా కేమోప్లాజ్ టెక్నిక్ తో కప్పిపెడతారు. గాజా పట్టణంలో దాదాపు 1300 వందలకుపైగా సొరంగాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ప్రవేశమార్గాలు సామాన్య ప్రజలు అధికంగా తిరిగే స్కూల్స్, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులు, పౌరకట్టడాల్లో ఉండేట్లు చూసుకున్నారు. ఇక్కడైతే ఐడీఎఫ్ దాడులు చేయదని వారి నమ్మకం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఈ టన్నెల్స్ , అండర్ గ్రౌండ్ బంకర్లపై గురిపెట్టింది. అందులో తలదాచుకున్న హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టేందుకు అన్నివిధాల ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో టన్నెల్స్, అండర్ గ్రౌండ్ బంకర్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం..
బాంబుల మోతతో గాజా శిథిలమవుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల తరువాత ఇప్పటి వరకు 3.83లక్షల మంది నిరాశ్రయులయినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. హమాస్ ఆక్రమించిన గాజా స్ట్రీప్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాదాపు 3లక్షల రిజర్వ్ బలగాలను మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.