Israel Iran conflict: ఇజ్రాయెల్ ప్రధాని, ఫ్రెంచ్ అధ్యక్షుడి మధ్య వివాదం ఏమిటి..? వెనక్కు తగ్గేదిలేదన్న నెతన్యాహు

పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా.. లేకున్నా ఇజ్రాయెల్ ఈ యుద్ధం గెలిచే వరకు పోరాడుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.

Benjamin Netanyahu and Emmanuel Macron

Benjamin Netanyahu vs Emmanuel Macron: ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య వార్ తారాస్థాయికి చేరుతుంది. ఇరాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతుంది. మేముకూడా తగ్గేది లేదంటూ ఇరాన్ కయ్యానికి మరింత కాలుదువ్వుతోంది. వీరి మధ్య శాంతి చర్చలకు అవకాశం లేకుండాపోయింది. మరోవైపు ఇజ్రాయెల్ లోని గ్యాస్ నిల్వలను టార్గెట్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇవ్వగా.. ఇరాన్ లోని చమురు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతుంది. ఇరాన్ చమురు కేంద్రాలపై కాకుండా ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయ ఆలోచించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. మరోవైపు గాజాపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్రేక్ చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూఎస్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్ కు అన్నివిధాల తాము సహకారం అందిస్తుంటే.. ఇజ్రాయెల్ నిబంధనలు అతిక్రమిస్తుందంటూ బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ ప్రధాని మధ్య మాటల యుద్ధంకు దారితీసింది.

Also Read : Israel and Hamas war: గాజాలో మసీదు, పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయెల్ గాజాలో దాడులకు పాల్పడి కాల్పుల విరమణ పిలుపును పట్టించుకోవడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూల్ మక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో పోరాడటానికి ఇజ్రాయెల్ కు ఆయుధ విక్రయాలను ఆపేస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ పొరపాటు చేసింది. ఇజ్రాయెల్ దూకుడు ఆ దేశ భద్రతపైకూడా ప్రభావం చూపుతుందని భావిస్తున్నాం. యుద్ధం విద్వేషాలకు దారి తీసింది. లెబనాన్ గాజాలా మారకూడదని మాక్రాన్ వ్యాఖ్యానించారు. లెబనాన్ లోని సరిహద్దుల్లో దళాలను పంపాలన్న నెతన్యాహు నిర్ణయాన్నికూడా తప్పుబట్టాడు. ఇజ్రాయెల్ కు ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని ఫ్రాన్స్ అధినేత మాక్రాన్ వ్యాఖ్యలపై నెతన్యాహు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాక్రాన్ తో సహా ఇతర పాశ్చాత్య నాయకులు ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని అన్నారు.

Also Read : ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్..! ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడికి సన్నాహాలు..!

ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతుంది.. ఈ కారణంగా ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ వైపు ఉండాలంటూ నెతన్యాహు కోరాడు. ఇరాన్ హెజ్ బొల్లా, హమాస్, హౌతీలపై ఆయుధ నిషేధం విధిస్తుందా అని ప్రశ్నించాడు. గతేడాది అక్టోబర్ 7వ తేదీ నాటి దాడుల్లో వేలాది మంది ఇజ్రాయెలీలు మరణించారు. అందుకే మేమే గాజా, లెబనాన్ లో పోరాడుతున్నాం. అక్టోబర్ 7వ తేదీ నాటి దాడి కంటే పెద్ద మరణకాండను ఉత్తర సరిహద్దుల్లో హెజ్ బొల్లా ప్లాన్ చేస్తుంది.. పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా.. మద్దతు ఇవ్వకపోయినా ఇజ్రాయెల్ ఈ యుద్ధం గెలిచే వరకు పోరాడుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.

హమాస్ మిలిటెంట్లు గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై దాడి చేసి 1200 మందిని హతమార్చడంతో దశాబ్దాల నాటి ఇజ్రాయెల్ – పాలస్తీనా వివాదం మళ్లీ రాజుకుంది. హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకుంది. ఇప్పటికీ వారి వద్ద మరో 100 మంది బందీలుగా ఉన్నారు. హమాస్ మిలిటెంట్ల దశ్చర్యతో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో వేలాది మంది మరణించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడిలో 42వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. దీనికితోడు 23 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. రేపటితో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది అవుతుంది.