ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్..! ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడికి సన్నాహాలు..!
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Israel Iran War : ఏ క్షణమైనా ఇరాన్ పై దాడి చేసే యోచనలో ఇజ్రాయెల్ ఉంది. ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని వ్యూహాలు రచిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే తమ ప్రతీకారం ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏ క్షణమైనా దాడులు జరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అటు, ఇరాన్ లోని ఆయిల్ సెంటర్లపై ఇజ్రాయెల్ గురి పెట్టింది. చమురు కేంద్రాలపై దాడి చేసి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టాలన్నది ఇజ్రాయెల్ ఆలోచన.
మరోవైపు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. దెబ్బకు దెబ్బ తీస్తామంటోంది. ఇజ్రాయెల్ కు తమ దెబ్బ రుచి ఏంటో చూపిస్తామంటోంది. ఇజ్రాయెల్ లోని గ్యాస్ నిల్వలను టార్గెట్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇది ఇలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శాంతి మార్గాన్ని సూచిస్తుంటే.. ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేస్తుందని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కావాలనే గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహూ బ్రేక్ చేస్తున్నారని అన్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని చర్యలను లెక్క చేయాల్సిన అవసరం లేదన్నారు బైడెన్.
ఇజ్రాయెల్ కు తనకంటే ఎక్కువ సాయం ఎవరూ చేయలేదన్న బైడెన్.. దాన్ని నెతన్యాహు గుర్తుంచుకోవాలన్నారు. ఇరాన్ చమురు కేంద్రాలపై కాకుండా ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయం ఆలోచించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ ఓ నిర్ణయానికి రాలేకపోతోందన్నారు. తాను వారి స్థానంలో ఉంటే చమురు కేంద్రాలపై దాడికి బదులు ప్రత్యామ్నాయల గురించి ఆలోచిస్తానని బైడెన్ తెలిపారు.
Also Read : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 30ఏళ్ల స్నేహం ఎందుకు చెడింది? ఈ స్థాయిలో శత్రుత్వానికి కారణమేంటి?