Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన జర్నలిస్టు భాగస్వామి ఆండ్రియా జియాంబ్రూనో నుంచి విడిపోయారు. ఆండ్రియా గియాంబ్రూనోతో తన సంబంధం ఇక్కడితో ముగిసిందని మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. వారి వివాహబంధం సుమారు 10 సంవత్సరాలు కొనసాగింది. 46 ఏళ్ల ఇటలీ ప్రధాని.. కొంతకాలంగానే విడాకుల గురించి చెప్తున్నారట. అయితే దాన్ని అంగీకరించేందుకు గియాంబ్రూనోకు ఇంత సమయం పట్టింది.
నిజానికి వీరిద్దరికి వావాహమే కాలేదు
ప్రత్యేక సమాచారం ప్రకారం.. జియాంబ్రూనో, మెలోనికి వివాహం కాలేదట. అయితే, వారు చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అప్పటికే గియాంబ్రూకు ఏడేళ్ల కూతురు ఉంది. దీని గురించి మెలోని స్పందిస్తూ.. ‘‘మేము కలిసి గడిపిన అద్భుతమైన సంవత్సరాలకు గాను నేను అతనికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎదుర్కొన్న అన్ని కష్టాలలో నాతో ఉన్నందుకు, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం మా కుమార్తె జెనీవ్రాను అందించినందుకు నేను అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు.
జియాంబ్రూనో మహిళలపై వ్యాఖ్యానించడం ద్వారా వివాదంలోకి
సుప్రసిద్ధ టెలివిజన్ హోస్ట్ గురించి గియాంబ్రూనో స్పందిస్తూ తన షోలో మహిళలు ఎక్కువగా మద్యం సేవించడం ద్వారా అత్యాచారాలను నివారించవచ్చని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలకు గురయ్యారు. దీనిపై మెలోని స్పందిస్తూ.. తన భాగస్వామి వ్యాఖ్యల ఆధారంగా తనను అంచనా వేయకూడదని, భవిష్యత్తులో ఆయన ప్రవర్తన గురించిన ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వబోనని చెప్పారు.
మెలోని ఎమోషనల్ పోస్ట్
ఇంతలో తన భాగస్వామితో విడిపోవడానికి సంబంధించి ఎక్స్ ఖాతా ద్వారా ఆమె స్పందిస్తూ.. ‘‘మా స్నేహాన్ని నేను కాపాడుతాను. అమ్మా నాన్నలను ప్రేమించే మా ఏడేళ్ల అమ్మాయిని నేను రక్షించుకుంటాను. నా తల్లికి నా ప్రేమను చెప్పుకునే అవకాశం నాకు రాలేదు. కానీ నా కుమార్తెతో నేను అదృష్టవంతురాలిని. దాని గురించి నేను చెప్పడానికి ఇంకేమీ లేదు’’ అని పోస్ట్ చేశారు.
1977లో రోమ్‌లో జన్మించిన మెలోని.. ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ (MSI) యువజన విభాగంలో చేరినప్పుడు ఆమె వయస్సు 15 సంవత్సరాలు. ఆమె 2015 లో ఒక టీవీ షో కోసం రచయితగా పనిచేస్తున్నప్పుడు జియాంబ్రూనోను కలిశారు. ఈ కార్యక్రమంలో వారి స్నేహం చిగురించి బంధం వరకూ వెళ్లింది. జియాంబ్రూనో 1981లో మిలన్‌లో జన్మించారు.