19 Missing As Mudslide Tokyo Hits Houses
19 missing as mudslide tokyo hits houses : జపాన్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో జపాన్ రాజధాని టోక్యోకు పశ్చిమాన ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు.నీటి బుగ్గలకు పేరుగాంచిన అటామి అనే పట్టణంలో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈక్రమంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఇంకా ఉన్నందున ఆ ప్రాంతంలోని ఇళ్లలోని జనాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
చాలా శక్తివంతమైన నల్లటి మట్టిచరియలు వేగంగా దూసుకువచ్చినట్లు టీవీ ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. గత వారం నుంచి జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మరిన్ని కొడచరియలు విరిగిపడే ప్రమాదమున్నందున ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టి చరియల కింద గల్లంతు అయినవారి గురించి గాలింపు ముమ్మరం చేశారు.