ఆహా ఇలాంటి కంపెనీలో జాబ్ వస్తే.. తాగడానికి ఫుల్ మందు.. అది దిగకపోతే నెక్ట్స్ డే హ్యాంగోవర్ లీవ్ కూడా ఇస్తారట..

జపాన్ కు చెందిన ‘ట్రస్ట్ రింగ్’ అనే సంస్థ ఉద్యోగులు చురుగ్గా విధుల్లో పాల్గొనేందుకు సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.

Japanese tech company

Japanese tech company: ప్రైవేట్ కంపెనీలు తమ సంస్థలో పనిచేసేందుకు ప్రతిభ కలిగిన యువతను ఆకర్షించేందుకు అనేక సదుపాయాలను కల్పిస్తుంటాయి. ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగానికి చెందిన కంపెనీల్లో ఈ విధానం ఎక్కువగా ఉంటుంది. పలు కంపెనీలు ఎక్యువ ప్యాకేజీ అందించి ప్రతిభ కలిగిన వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటుండగా.. మరికొన్ని కంపెనీలు విలాసవంతమైన వసతులు, వారానికి రెండు రోజులు పార్టీలు ఆఫర్ చేస్తూ.. ఉద్యోగులు విధుల్లో చురుగ్గా ఉండేలా చూస్తుంటాయి. ఇదేకోవలో జపాన్ కు చెందిన ‘ట్రస్ట్ రింగ్’ అనే సంస్థ మరో అడుగు ముందుకేసి ఇంకాస్త భిన్నంగా ఆలోచించింది.

Also Read: Navy Jobs: నేవీలో జాబ్స్.. సెలెక్ట్ అయితే ఫస్ట్ మంత్ నుంచే శాలరీ లక్ష.. జస్ట్ ఇంటర్వ్యూ పాసైతే చాలు

జపాన్ కు చెందిన ‘ట్రస్ట్ రింగ్’ అనే సంస్థ ఉద్యోగులు చురుగ్గా విధుల్లో పాల్గొనేందుకు, కొత్త వారు సదరు సంస్థలో పనిచేసేందుకు ఉత్సాహం చూపేలా.. సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచితంగా తాగినంత మందును సరఫరా చేస్తుంది. అంతేకాదు.. మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. అదేమిటంటే.. మద్యం ఫుల్ గా తాగిన వారిలో ఉదయాన్నే చాలా మంది హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పొద్దున్నేలేచి ఉద్యోగానికి రావాలంటే ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికోసం ట్రస్ట్ రింగ్ సంస్థ హ్యాంగోవర్ లీవ్ కూడా ఇస్తుంది. ఉద్యోగుల్లో ఎవరైనా ఈ సెలవును ఉపయోగించుకొని మత్తుదిగాక తిరిగి విధుల్లోకి రావొచ్చు.

Also Read: JEE Main 2025 Result: జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ ఫలితాలు వచ్చేశాయి.. చెక్‌ చేసుకున్నారా? ఇలా స్టెప్ బై స్టెప్‌ చూసుకోండి..

ట్రస్ట్ రింగ్ సంస్థ కల్పిస్తున్న సదుపాయాలతో ఉద్యోగులుసైతం ఫుల్ హ్యాపీ అవుతున్నారట. హ్యాంగోవర్ సెలవు తమకు బాగా ఉపయోగపడుతోందని, రెండు, మూడు గంటలు హాయిగా నిద్రపోయి ఆఫీసుకు వస్తున్నామని ఆ కంపెనీ ఉద్యోగులు హ్యాపీగా చెబుతున్నారు. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఉద్యోగంలో చేరే కొత్త వారికి ఈ కంపెనీలో ఎక్కువ శాలరీ ఉండదట. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికి ఎక్కువ వేతనాలు ఇచ్చుకోలేకనే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఈ విషయం తెలుసుకొని నెటిజన్లు అవాక్కవుతున్నారు. అదేంటి.. మద్యం సరఫరా చేసే బదులు వేతనాలు ఎక్కువగా ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అంటూ కొందరు నెటిజన్లు కంపెనీ యాజమాన్యంకు సూచనలు చేస్తున్నారు.

మరోవైపు.. జపాన్ లోని రెండు కంపెనీలు ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసేందుకు కార్యాలయాల్లో ప్రత్యేకంగా నిద్ర పోవటానికి గదులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయట. తద్వారా ఓ గంట లేదా రెండు గంటలు నిద్రపోయి ఆ తరువాత ఉత్సాహంగా పనిచేస్తారని ఆ కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి.