JEE Main 2025 Result: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా? ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకోండి..
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా?

JEE Main Result 2025 declared
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. బాలికల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు విద్యార్థిని జీ మనోజ్ఞకు 100 పర్సంటైల్ దక్కింది. అలాగే, తెలంగాణకు చెందిన బని బ్రతా మజీ కూడా 100 పర్సంటైల్ సాధించి సత్తా చాటారు.
ఈ పరీక్షలు గత నెల 22 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ఉంటుంది.
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ నుంచి అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్కోర్‌కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
- https://jeemain.nta.nic.in/ కు వెళ్లండి
- జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల లింక్‌ని క్లిక్ చేయాలి
- మీ పాస్‌వర్డ్/పుట్టిన తేదీ, మీ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్‌ను పొందుపర్చండి
- అవసరమైన సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి
- చివరకు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
- మీ ఫలితాలు వస్తాయి
- స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోండి
100 ఎన్‌టీఏ స్కోర్ సాధించిన 14 మంది అభ్యర్థులు..
ఆయుష్ సింఘాల్, రాజస్థాన్
కుశగ్ర గుప్తా, కర్ణాటక
దక్ష్, ఢిల్లీ (ఎన్సీటీ)
హర్స్మ్ఝా, ఢిల్లీ (ఎన్సీటీ)
రజిత్ గుప్తా, రాజస్థాన్
శ్రేయస్ లోహియా, ఉత్తర ప్రదేశ్
సాక్షం జిందాల్, రాజస్థాన్
సౌరవ్, ఉత్తర ప్రదేశ్
విశాద్ జైన్, మహారాష్ట్ర
అర్ణవ్ సింగ్, రాజస్థాన్
శివన్ వికాస్ తోష్నివాల్, గుజరాత్
సాయి మనోజ్ఞ గుత్తికొండ, ఆంధ్ర ప్రదేశ్
ఓం ప్రకాష్ బెహెరా, రాజస్థాన్
బని బ్రతా మజీ, తెలంగాణ
ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్‌పై అతి భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఇప్పుడే కొనుక్కోండి..