ఓర్నీ.. నిర్మలా సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ మీద అంత పెద్ద ప్రకటన చేస్తే… ఆర్థిక వ్యవస్థ పెరిగేది ఇంతేనా.. షాకింగ్ రిపోర్ట్
కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఊతం వస్తుందని భావించింది.

Nirmala Sitharaman
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు భారీగా ఇస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, సీతారామన్ ఇచ్చిన ట్యాక్స్ మినహాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కేవలం 20 బేసిస్ పాయింట్ల మేరకు మాత్రమే ముందుకు తీసుకెళ్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అంచనా వేసింది.
కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్ను తగ్గింపులను ప్రకటించినప్పటికీ, అవి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మరీ అంతగా ఉపయోగపడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చెప్పింది.
ఎందుకంటే ప్రజలు తమకు పన్నుల మినహాయింపుల ద్వారా వచ్చిన పొదుపులను ఎక్కువ ఖర్చు చేయడానికి బదులుగా తమకు ఉన్న రుణాలను తీర్చడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో సర్కారు కూడా సొంత ఖర్చులను తగ్గిస్తోంది.
Also Read: ఇస్రో మహాద్భుత ప్రయోగం.. గగన్‌యాన్ ప్రాజెక్టులో అంతరిక్షానికి నుసిపురుగులు.. ఎందుకంటే?
ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్న ఉద్దేశంలో బడ్జెట్‌లో సుమారు రూ.1 లక్ష కోట్ల పన్ను తగ్గింపులను కేంద్ర సర్కారు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ సంస్థకు చెందిన ఆర్థికవేత్తలు నిఖిల్ గుప్తా, తానిషా లాడ్ చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కేవలం 0.1 శాతం నుంచి 0.2 శాతం (10-20 బేసిస్ పాయింట్లు) పెంచుతుందని తెలిపారు. అంటే, పన్ను కోతలు ప్రజలకు సహాయపడతాయి కానీ, ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంలో పెద్దగా తేడా ఉండదు.
దేశంలో చాలా మందికి అప్పులు ఉన్నాయి. వారి ఆదాయంలో 52 శాతం అప్పులకే పోతుంది. పదేళ్ల క్రితం ఈ పర్సెంటేజ్ 35 శాతంగా ఉండేది.
ఈ కారణంగా వారు తమకు పన్నుల ద్వారా మిగిలిన ఆదాయాన్ని షాపింగ్, పెట్టుబడుల కోసం ఖర్చు చేయడానికి బదులుగా వారు దానిని రుణాలు చెల్లించడానికి ఉపయోగిస్తారని ఆర్థిక వేత్తలు తెలిపారు. సర్కారు తన సొంత ఖర్చులను తగ్గిస్తుండడంతో ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేశారు.