Japanese Grapes: ఒక్క ద్రాక్ష గుత్తి రూ.30వేలు.. వేలం వేసి మరీ అమ్మకం

లగ్జరీ ఫుడ్ తినేవారికి, ఫుడ్ ప్రియులకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. బిర్యానీ, ఐస్ క్రీమ్ ఎలాంటి లగ్జరీ ఫుడ్‌కైనా వాడే సింపుల్ గార్నిష్ ఐటెం.

Japanese Grapes: ఒక్క ద్రాక్ష గుత్తి రూ.30వేలు.. వేలం వేసి మరీ అమ్మకం

Ruby Grapes

Updated On : September 23, 2021 / 9:55 AM IST

Japanese Grapes: లగ్జరీ ఫుడ్ తినేవారికి, ఫుడ్ ప్రియులకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. బిర్యానీ, ఐస్ క్రీమ్ ఎలాంటి లగ్జరీ ఫుడ్‌కైనా వాడే సింపుల్ గార్నిష్ ఐటెం. అవే జపాన్ గ్రేప్స్. వీటి ఖరీదు ఒక్కోటి దాదాపు రూ.30వేల వరకూ ఉంటుందట. జపాన్‌కు చెందిన లగ్జరీ వెరైటీ రూబీ రోమన్ గ్రేప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.

సైజులో కూడా సాధారణమైన ద్రాక్ష కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటాయి. దీని కలర్ కూడా ప్రత్యేకం. మామూలు వాటి కంటే రుచిలో ఎక్కువ తియ్యదనం. 2020 మొత్తంలో అమ్మకానికి అందుబాటులో ఉన్నవి రూ.25వేలు. అత్యంత ఖరీదైన రూబీ రోమన్ గ్రేప్స్ చాలా అరుదుగా దొరుకుతాయి.

……………………………………….Modi America Tour : అమెరికాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

ఈ ఒక్కో ద్రాక్ష ధర 90 నుంచి 450డాలర్ల వరకూ పలుకగా ఒక్క ద్రాక్ష పంట ఖరీదు 12వేల డాలర్లు (రూ.8.8లక్షలు). క్వాలిటీ ఆధారంగా వాటి ధర పెరిగే అవకాశాలు లేకపోలేదు. అన్నింటిలాగే లగ్జరీ గ్రేప్స్ క్వాలిటీ, టేస్ట్ లను బట్టి ధర మారుతుంటుంది. సరైన కాంతి, ఉష్ణోగ్రతల ఆధారంగా పంట వృద్ధి ఉంటుంది.