Laughter lessons in Japan : మాస్క్ వల్ల నవ్వడం మర్చిపోతారా?

జపాన్‌లో తాజాగా మాస్క్‌‌లు ధరించాలనే నిబంధన ఎత్తివేశారు. అయితే అక్కడి ప్రజలకు కొత్త కష్టం వచ్చింది. 2020 నుంచి ముఖానికి మాస్క్‌లు వాడటం అలవాటై నవ్వే సామర్థ్యం కోల్పోయారట. ఇప్పుడిక నవ్వుల పాఠాలు నేర్చుకునేందుకు ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు.

Japanese learning laughter lessons : కరోనా కారణంగా ముఖానికి మాస్క్ తప్పనిసరి అయిపోయింది. ఇంకా చాలాచోట్ల మాస్క్ ధరించాలన్న నిబంధనలు అమలులో ఉన్నాయి. తాజాగా జపాన్ లో మాస్క్ ధరించాలన్న నిబంధనలు ఎత్తివేయడంతో జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే కొంతకాలంగా మాస్క్ అడ్డంగా పెట్టుకుని నవ్వడం మర్చిపోయిన జపనీయులు నవ్వుల పాఠాలు నేర్చుకోవడానికి ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారట.

Beautiful Smile : ఆరోగ్యకరమైన అందమైన చిరునవ్వు కోసం!

2020లో కరోనా మహమ్మారి మొదలైన తరువాత మార్చి నుంచి మాస్క్ లు ధరించడం కంపల్సరీ అయ్యింది. ఇప్పటికి జపాన్ లో మాస్క్ మాండేట్ ఎత్తివేయడంతో నవ్వడం మర్చిపోయిన జపాన్ ప్రజలు ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు. మీరు విన్నది నిజమే.

 

జపాన్ లో మాస్క్ లు విపరీతంగా వాడటం వల్ల కొత్త సమస్య వచ్చిందట. దాంతో వారు నవ్వే సామర్థ్యాన్ని కోల్పోయారట. అందుకోసమే ఈ పాఠాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇక ఇన్నిరోజులు మాస్క్ లతో తిరిగిన జనం మాస్క్ లేకుండా బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట. అందుకోసం కొన్ని కంపెనీలు స్మైలింగ్ తరగతులు నిర్వహిస్తున్నాయట.

Laughter : నవ్వు మీ జీవితంలో ఎలా సహాయపడుతుందంటే!

ఇక ఇదే మంచి సమయం అన్నట్లు నవ్వులు నేర్పించే ట్యూటర్లు పుట్టుకొస్తున్నారు. నవ్వడం నేర్పిస్తున్నారు. టోక్యోలో వృద్ధులకు మళ్లీ నవ్వడం ఎలాగో తెలుసుకోవడానికి ఒక సీనియర్ కేరక్ సెంటర్ వర్క్ షాప్స్ నిర్వహిస్తోందట. మొత్తానికి జపాన్ ప్రజలు కోల్పోయిన నవ్వు సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు చాలా కష్టపడుతున్నారన్నమాట.

ట్రెండింగ్ వార్తలు