Beautiful Smile : ఆరోగ్యకరమైన అందమైన చిరునవ్వు కోసం!

భోజనం చేసిన ప్రతిసారి మన దంతాల్లో కొన్ని ఆహారపదార్థాలు పళ్లల్లో ఇరుక్కుపోవడం సర్వసాధారణం. భోజనం చేసిన తరువాత పళ్ళను శుభ్రంచేసుకోవడం చాలా మంచిది. దంతదావనం చేసిన సమయంలో చూపుడు వేలితో చిగుర్ల పై మర్ధన చేయాలి.

Beautiful Smile : ఆరోగ్యకరమైన అందమైన చిరునవ్వు కోసం!

Smile

Beautiful Smile : ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, అందమైన చిరునవ్వును కలిగి ఉండాలని కోరుకుంటారు, ఇది సాధ్యం చేసుకోవాలంటే క్రమం తప్పకుండా నోటి పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. ప్రకాశవంతమైన చిరునవ్వు మీకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా, మరింత నమ్మకంగా కనిపించడానికి తోడ్పడుతుంది. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను ప్రభావితం చేయడంలో మీకు సహాయపడుతుంది. దంత పరిశుభ్రతను మెరుగుపరచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవటం మంచిది. చిరునవ్వును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఆరోగ్యకరమైన దంత నియమావళిని తప్పనిసరిగా పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మీ రోజువారీ నోటి పరిశుభ్రతలో మౌత్ వాష్ కూడా చాలా ముఖ్యమైనది. మౌత్‌వాష్‌ మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందమైన చిరునవ్వు మరింత అందంగా కనిపించేలా చేయడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా కొన్ని ఆహారాలు మీ చిగుళ్ళను బలంగా, దంతాలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. చిగుళ్ళు తగినంత బలంగా లేకుంటే, దంతాలు ఊడిపోతాయి. అందువల్ల, చిగుళ్ళను బలంగా చేయడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

విటమిన్ డి లోపం కారణంగా దంతాలు, చిగుర్లుఅనార్యోగం పాలవుతాయి. దంతాలను శుభ్రపరుచుకోవడంలో ఏ మాత్రం ఏమర పాటు అలక్షణ ప్రదర్శించిన బ్లడ్ క్యాన్సర్లు, ఎముక కాన్సర్ సంకేతాలు నోటిలో కనిపిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి కలిగి ఉండే నారింజ, ఆకుపచ్చ బెల్ పెప్పర్స్, ట్యూనా, సాల్మన్ మొదలైన వాటిని ఆహరంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి,రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. అదేవిధంగా బ్రష్ చేయడానికి ముందు ఫ్లాసింగ్ చేయడం వల్ల ఎక్కువ బ్యాక్టీరియా తొలగిపోతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలు ,బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి ఫ్లాసింగ్ సహాయపడుతుంది. తరువాత బ్రష్ చేయడం వల్ల నోరు మరింత శుభ్రంగా మారుతుంది.

భోజనం చేసిన ప్రతిసారి మన దంతాల్లో కొన్ని ఆహారపదార్థాలు పళ్లల్లో ఇరుక్కుపోవడం సర్వసాధారణం. భోజనం చేసిన తరువాత పళ్ళను శుభ్రంచేసుకోవడం చాలా మంచిది. దంతదావనం చేసిన సమయంలో చూపుడు వేలితో చిగుర్ల పై మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్లకు మంచి ఎక్సరసైజ్ లభిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దంత సమస్యలను నివారించడంలో సరైన నోటి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల ఎంపిక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

సరైన నోటి సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం సమస్యే అయినప్పటికీ టూత్ బ్రష్, మౌత్ వాష్, డెంటల్ ఫ్లాస్, టంగ్ క్లీనర్‌తో డెంటల్ కిట్‌ను తప్పనిసరిగా నిర్వహించటం మంచి అలవాటు. ఏవైనా దంత సమస్యలు ఎదురైతే వెంటనే దంత పరీక్షలను చేయించుకునేందుకు దంత వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. సకాలంలో వైద్యుని వద్దకు వెళితే చికిత్స సులభంగా ఉంటుంది. సమస్యను ఆలస్యంగా గుర్తించడం కంటే, అది చికిత్స చేయగలిగినప్పుడు ముందుగానే గుర్తించడం మంచిది.