Bezos Blue Origin Guinness record : గిన్నిస్‌‌లోకి జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’.. మరో 4 రికార్డులు కూడా..!

ప్రముఖ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ‘బ్లూ ఆరిజిన్’ గిన్నిస్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది.

Jeff bezos Blue Origin Guinness record : ప్రముఖ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ‘బ్లూ ఆరిజిన్’.. గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు..దటీజ్ బ్లూ ఆరిజిన్ అన్నట్లుగా ఏకంగా నాలుగు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.2021 జులైలో జెఫ్ బెజోస్ తో పాటు ఆయన టీమ్ అంతరిక్షయానం చేసి వచ్చిన విషయం తెలిసిందే. వీరి అంతరిక్ష నౌక సురక్షితంగా.. విజయవంతంగా.. భూమ్మీదకు ల్యాండ్ అయిన కొన్ని నెలల తరువాత బ్లూ ఆరిజిన్ టీమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అంతరిక్షయానం రేసులో ప్రయోజనం పొందేందుకు బ్లూ ఆరిజిన్ భద్రతా సమస్యలను విస్మరించిందనే వాదనల మధ్య.. ఈ రాకెట్‌ ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.

Read more : Blue Origin New Shepard : రోదసీలోకి వెళ్లొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్!

మొదటి బృంద మిషన్ విజయవంతంగా ప్రారంభించటం అంతకంటే విజయవంతంగా ల్యాండింగ్ అయిన కొన్ని నెలల తర్వాత జెఫ్‌ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజన్‌’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో తన పేరును నమోదు చేసుకుంది. అంతరిక్షంలోకి బాస్ జెఫ్ బెజోస్‌ని తీసుకెళ్లిన ఈ విమానం నాలుగు ప్రపంచ రికార్డులను సృష్టించింది.అంతరిక్ష ప్రయాణం.. అభివృద్ధి చెందుతున్న స్పేస్ టూరిజం రంగాన్ని బలోపేతం చేసిందని చెప్పవచ్చు. కార్మెన్ లైన్ పైన (భూమికి 100 కి.మీ.) పైన అంతరిక్ష నౌకలో నలుగురు ప్రయాణికులు వెళ్లి భూమికి తిరిగి రావడానికి.. వారు 3 నిమిషాల పాటు ప్రయాణించారు.

Read more : Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

ఈ అంతరిక్ష యానంలోకి వెళ్లినవారిలో 82 ఏళ్ల వాలీ ఫంక్..పెద్ద వయసు గల వ్యక్తి కావటం విశేషం. అలాగే అతి వయస్కుడు 19 ఏళ్ల ఆలివర్‌ డేమన్ ఉన్నారు.వీరితో పాటు అంతరిక్షానికి వెళ్లిన మొదటి తోబుట్టువులుగా జెఫ్‌ బెజోస్‌, మార్క్‌ బెజోస్‌. అలాగే చెల్లింపు వినియోగదారులను తీసుకువెళ్లిన మొదటి సబార్బిటల్ అంతరిక్ష నౌక (న్యూ షెఫర్డ్)‌.. వంటి నాలుగు ప్రపంచ రికార్డులను ఈ రాకెట్‌ క్రియేట్ చేసింది. బ్లూ ఆరిజిన్ తన తదుపరి మిషన్‌ ప్రయాణం అక్టోబర్ 12 న జరుగుతుందని ప్రకటించింది. ఇది భూమి మించి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి. తిరిగి తీసుకురానుంది. టిక్కెట్ల అమ్మకం కోసం ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీ మరో రెండు సిబ్బంది విమానాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది ఈ కంపెనీ.

Read more : China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు..

భూమ్మీదకు వచ్చిన తరువాత జెఫ్ బెజోస్ మాట్లాడుతు..ఇదొక అత్యద్భుతమైన ప్రయాణమని..ఇదొ చరిత్రలో అత్యుత్తమమైనరోజు అని అన్నారు. అలా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన 571వ వ్యోమగామిగా జెఫ్ బెజోస్ గుర్తింపబడ్డారు. 19 ఏళ్ల ఆలివర్‌ డేమన్ అంతరిక్షానికి వెళ్లిన అతి చిన్నవయస్సు గలవాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆలివర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్. 28 మిలియన్ల డాలర్లు చెల్లించి ఈ అంతరిక్షయానం చేశాడు ఆలివర్. డెమెన్ తండ్రి ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CEO. ఈ అంతరిక్షయానికి టికెట్ వేలం వేయగా 28 మిలియన్ల డాలర్లు చెల్లించి ఆ అవకాశాన్ని ఆలివర్ దక్కించుకున్నాడు.

Read more : Jeff Bezos : జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రలో 18 ఏళ్ల కుర్రాడు

ట్రెండింగ్ వార్తలు