Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

టూర్ వెళ్లటమంటే మనం నివసించే భూమ్మీద ఆదేశం ఈ దేశం తిరగటం కాదు. ట్రెండ్ మారింది. స్పేస్ టూర్ కూడా సక్సెస్ ఫుల్ గా జరిగిపోయింది. ఇక చందమామ మీదకు టూర్ వెళదాం వస్తారా? అంటున్నారు.

Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

Nasa Moon Touris

NASA Moon Touris : ఒకప్పుడు పెద్ద వయస్సు వచ్చినవాళ్లే కాశీ రామేశ్వరాలు వెళ్లి వచ్చేవారు.బద్రీనాథ్, కేదార్ నాథ్ యాత్రలు చేయాలంటే ఆస్తిపాస్తులన్నీ వారసులకు అప్పగించి..మూటా ముళ్లే సర్ధుకుని వెళ్లేవారు. అలా వెళ్లే యాత్రల్ని తీర్థయాత్రలు అనేవారు. కానీ ఇప్పుడో ఇలా అనుకుంటే చాలు అలా హోటల్ రూమ్స్ నుంచి వెహికల్స్ అన్నీ బుక్ చేసేసుకుని వెళ్లిపోతున్నారు. ఇలా టూర్ వెళ్లాలంటే చేతిలో డబ్బులుంటే చాలు చాలా ఈజీ అయిపోయింది. ఇలా ఎంత ఈజీ అయినా భూమ్మీదే తిరుగుతాం. కానీ ఇది టెక్నాలజీ యుగం. భూమ్మీదే కాదు స్పేస్ లో కూడా టూర్ లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. వచ్చేశాయి కూడా. కొంతమంది వెళ్లి వచ్చారుకూడా స్పేస్ టూర్ కు.

Read more : Blue Origin New Shepard : రోదసీలోకి వెళ్లొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్!

కానీ వేరే గ్రహానికి టూర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చందమామ మీదకు టూర్ వెళదామా? వస్తారా ఫ్రెండ్స్ అనేంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. స్పేస్‌ టూరిజం తర్వాత మూన్‌ టూరిజం రియాలిటీగా మారబోతోంది. ఇదికూడా త్వరలో అందుబాటులోకి వచ్చేస్తోంది. చక్కగా మంచంమీద వెల్లకిల్లా పడుకుని ఆకాశంలో చంద్రుడిని చూసే రోజుల నుంచి చందమామ మీదకే టూర్ వెళ్లే రోజులొచ్చేశాయి.

చందమామపైకి టూర్ అనేది అంతా అనుకున్నది అనుట్లుగా జరిగితే చాలా త్వరలోనే ఎంత త్వరగా అంటే కేవలం 3,4 ఏళ్లలోనే చంద్రుడిపైకి టూర్ వెళ్లొచ్చు అంటోంది నాసా. మూన్‌ టూరిజం కోసం నాసా ఇప్పటికే 5 కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. స్పేస్‌ఎక్స్‌లో ఇప్పటికే 8 మంది కస్టమర్లు రెడీగా ఉన్నారు.హలో అంటూ పొలోమంటూ వెళ్లటానికి ఎంత డబ్బు అయినా సరే చెల్లించటానికి రెడీ అంటున్నారు.

Read more : China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు..

టెస్లా అధినేత ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్, జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌తో పాటు మరో మూడు కంపెనీలు ఈ గ్రూపులో ఉన్నాయి. చంద్రుడిపైకి టూర్ వెళ్లటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించడానికి ల్యాండర్లను తయారు చేయడానికి నాసా నుంచి రూ.1,078 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నాసా ఆర్టెమిస్ మిషన్ ప్రోగ్రామ్ లక్ష్యం.. చంద్రుడిపైకి మహిళతోపాటు ఒక నల్లజాతీయుడిని పంపడం.స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌తో ఒప్పందం చంద్రుడిపైకి వెళ్లేందుకు కొత్త మార్గాలను తెరిచేందుకు బలమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉందని నాసా హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ మేనేజర్ లిసా వాట్సన్ మోర్గాన్ వెల్లడించారు. ఈ అంతరిక్ష పర్యాటకానికి వెళ్లటానికి రూ.400 కోట్లకంటే ఎక్కువే మరి.

Read more : China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు..

కాగా స్పేస్ టూర్ కంటే మూన్ టూర్ కాస్త కాస్ట్లీయే అంటున్నారు సైంటిస్టులు. ఈ మూన్ టూర్ ను ఈజీ చేయటానికి నాసా పర్యవేక్షణలో స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్‌ను రూపొందిస్తోంది. దీంట్లో భాగంగా మొదటివిడతగా నలుగురిని చంద్రుడిపైకి పంపటానికి నాసా పక్కా ప్లాన్ వేసింది. వీరు చంద్రుడిపై దిగిన వారం తరువాత తిరిగి భూమిపైకి చేరుకుంటారు. ఈ చంద్రుడిపైకి టూర్ వెరీ కాస్ట్లీ గురు అనేలా ఉంది. ఎంత కాస్ట్లీ అంటే రూ.21,000 కోట్లు..కానీ డబ్బులదేముంది ఈ మూన్ టూర్ ఎక్స్ పీరియన్స కంటే అనేవాళ్లు ఇదొక మంచి అవకాశమనిచెప్పాలి. చూశారా? టూర్ అనే మాటలో ఎన్ని రకాలున్నాయో..దటీజ్ టెక్నాలజీ మహిమ.

ఒకప్పుడు నేలమీద రెండు కాళ్లతో నడటానికి కష్టపడిపోయిన ఆకాలంనాటి అనాగరిక మానవుడు ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో స్పేస్ టూర్ లే కాదు నేల విడిచి సాము చేస్తున్నాడు.అదేనండీ మూమ్మీద టూర్లే కాదు గ్రహాల మీదకు కూడా టూర్స్ వెళ్లేలా అభివృద్ధి చెందాడు..