Jeff Bezos : జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రలో 18 ఏళ్ల కుర్రాడు

అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత, ప్రపంచంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మరికొన్ని రోజుల్లో జరుగనుంది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి మార్గం సుగమమం అయ్యింది. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లే వారి జాబితాలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు, 82ఏళ్ల వాలీ ఫంక్‌తో 18 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. ఈ కుర్రాడి ఒలివ్‌డెమెన్‌.

Jeff Bezos : జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రలో 18 ఏళ్ల కుర్రాడు

Jeff Bezos (1)

Blue Origin: చేతినిండా డబ్బులు.. వెళ్లాలనే ఇంట్రస్టు ఉండాలనే గానీ ప్రపంచాన్ని చుట్టు రావటం కాదు ఏకంగా అంతరిక్షానికే వెళ్లొచ్చని నిరూపించాడు ఓ 18 ఏళ్ల కుర్రాడు. అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత, ప్రపంచంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ త్వరలోనే అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు. జెఫ్ బెజోస్ తో పాటు మరో ముగ్గురు అంతరిక్ష విహారానికి వెళ్తున్నారు. వచ్చే మంగళవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేయనున్నారు. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లే వారిలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు, 82ఏళ్ల వాలీ ఫంక్‌తో పాటు 18 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. ఈ కుర్రాడి పేరు ఒలివ్‌డెమెన్‌. అంతరిక్ష యాత్ర కోసం ఒలివ్ డెమెన్.. బ్లూ ఆరిజిన్‌ సంస్థకు డబ్బులు చెల్లించాడు. బ్లూ ఆరిజిన్ ఒక స్పేస్ షిప్ బెర్త్‌ను 28 మిలియన్ డాలర్లకు వేలం వేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆలివర్ డెమెన్.. అంతరిక్ష యాత్ర చేయనున్న మొదటి కస్టమర్‌గా నిలవనున్నారు. అంతేకాదు.. అంతరిక్షయానం చేసే అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నాడు. గతంలో దివంగత సోవియట్ వ్యోమగామి గెర్మాన్ టిలోవ్‌ 25 ఏళ్లకే రోదసి యాత్ర చేసి, అంతరిక్షయానం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును ఈ 18 ఏళ్ల ఆలివర్‌ డెమెన్‌ బ్రేక్ చేసి మరో చరిత్ర క్రియేట్ చేయనున్నారు.ఆదివారం వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక అంతరిక్ష యాత్రకు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చింది. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, గుంటూరు మూలాలున్న తెలుగు యువతి బండ్ల శిరీషతోపాటు మరో నలుగురు రోదసీలోకి వెళ్లారు. యూనిటీ అంతరిక్ష నౌక భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి రోదసీగా భావించే కర్మాన్ రేఖను దాటి రాగా, న్యూషెపర్డ్ 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుండడం గమనార్హం. కాగా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కూడా త్వరలోనే అంతరిక్ష యాత్ర చేపట్టనుంది.

ఆరిజన్ డేమాన్ 2020 లో ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అతను ప్రైవేట్ పైలట్ లైసెన్స్ పొందటానికి ఒక సంవత్సరం సెలవు తీసుకున్నాడు. ఫిజిక్స్, ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్ అధ్యయనం చేయడానికి నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి హాజరవుతాడని కంపెనీ తెలిపింది.ఈ అంతరిక్ష ప్రయాణంలో, బెజోస్‌తో పాటు అతడి సోదరుడు మార్క్, వేలంలో మరో సీటు దక్కించుకున్న వ్యక్తి.. ముగ్గురు కలిసి వెళ్లనున్నారు. దీంట్లో అదనంగా ముగ్గురు సిబ్బంది ఉంటారు. మూడో సీటు కోసం నిర్వహించిన వేలానికి భారీ స్పందన వచ్చింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 5,000 బిడ్లు వచ్చాయని బ్లూ ఆరిజిన్ తెలిపింది. ప్రస్తుతం అత్యధిక బిడ్ 2.8 మిలియన్ డాలర్ల వరకు వెళ్లింది. అయితే ఇంత మొత్తంలో బిడ్ వేసిన వారి పేర్లను బ్లూ ఆరిజిన్ వెల్లడించలేదు.

బెజోస్ బృందాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్న న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. రాకెట్, క్యాప్సూల్ రెండింటినీ కలిగి ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ వ్యోమగామి అలెన్ షెపర్డ్ పేరుమీదుగా, దీనికి న్యూ షెపర్డ్ అనే పేరు పెట్టారు. ఈ రాకెట్ 60 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఆరుగురు ప్రయాణికులను భూమి నుంచి 62 మైళ్ల (100 కి.మీ) కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లనుంది. ఈ క్రమంలో భూమి ఉప కక్ష్యను దాటి, అంతరిక్షంలోకి వారిని తీసుకెళ్లనుంది.

బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ పేరుతో మరో వ్యోమనౌకను సైతం రూపొందించింది. అమెరికా వ్యోమగామి జాన్ గ్లెన్ గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు. న్యూ గ్లెన్ ఏకంగా 270 అడుగుల పొడవు ఉంటుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో పెద్ద పేలోడ్‌లను కక్ష్యలోకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కుబేరులు ఇలాంటి వాటినే భవిష్యత్తు వ్యాపార మార్గాలుగా ఎంచుకుంటున్నారు. న్యూ గ్లెన్, న్యూ షెపర్డ్ రెండూ నిలువుగా టేకాఫ్, నిలువుగా ల్యాండింగ్ అవుతాయి. వీటిని పునర్వినియోగానికి పనికొచ్చేలా రూపొందించారు.