Marriage, Birth Loans : పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లోన్లు ఇస్తున్న బ్యాంకులు 

పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి బ్యాంకులు  లోన్లు ఇస్తున్నాయి. అలా లోన్లు ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్ధతు ఇస్తోంది. పిల్లల్ని కనే సంఖ్యను బట్టి కూడా తక్కువ వడ్డీ లోన్లు..

Chinese Province Urges Marriage And birth Consumer Loans : ఇల్లు కట్టుకోవటానికి, బైక్ కొనుక్కోవటానికి, కార్లు కొనుక్కోవటానికి బ్యాంకులు లోన్లు ఇస్తాయనే విషయం తెలిసిందే. కానీ చైనాలో లోన్లు ఎందుకిస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పెళ్లి చేసుకోవటానికి, పిల్లల్ని కనటానికి లోన్లు ఇస్తున్నాయి చైనాలో బ్యాంకులు. అలా లోన్లు ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. అంతేకాదు పిల్లల్ని కనే సంఖ్యను బట్టి కూడా వడ్డీ ఉంటుంది. ఎక్కువమంది పిల్లల్ని కంటే తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు.

Read more : China`s population policy: ముగ్గురు పిల్లలను కనడానికి చైనా అనుమతి

చైనా అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అటువంటి చైనా ఒకప్పుడు ఒక్కబిడ్డనే కనాలని నిర్భంజధం విధించింది ప్రజలపై. కానీ జననాలు తగ్గిపోవటంతో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇద్దరు పిల్లల్ని కనటానికి అనుమతి ఇచ్చింది.అయినా సరిపోలా..దీంతో ముగ్గురు పిల్లల్ని కనాలని అనుమతులిచ్చింది.అయినా జనాలు పెళ్లి చేసుకోవానికి గానీ..పిల్లల్ని కనటానికి గానీ ఆసక్తి చూపట్లేదు.

దీంతో చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌ వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాదు 200,000 yuan (చైనా కరెన్సీ) అంటే మన కరెన్సీలో దాదాపు రూ.23 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు పిల్లల సంఖ్యనుబట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసుబాటు కూడా కల్పించింది. కొంతమంది జనాభా శాస్త్రవేత్తలు జిలిన్‌ ప్రావిన్స్‌లో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చని అంచనా వేశారు.

Read more : China population crisis :చైనాలో పెరిగిపోతున్న‘బ్యాచిలర్స్’..పెళ్లి అంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు..

దీంతో జిలిన్‌ ప్రావిన్స్‌ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది. అంతేకాదు ఆ చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి జంటలు నివాస పోందేందుకు అనుమతిచ్చింది. అయితే ఇలా అనుమతి పొందడాన్ని అక్కడ హుకౌ అని పిలుస్తారు. పైగా వారికి పిల్లలు ఉంటే వారు పబ్లిక్‌ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటే వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది.

అయితే జిలిన్ ప్రావిన్స్‌ చైనా”రస్ట్ బెల్ట్” ప్రాంతంలోని భాగం. ఈ ప్రాంతం వ్యవసాయానికి బాగా పేరొందింది. అయితే ఈ ప్రావిన్స్‌ గత కొన్ని సంవత్సరాలుగా జనాభా పెరుగుదల తగ్గిపోయింది. దీంతో ఆర్థిక వృద్ధి కూడా దారుణంగా పడిపోయింది. అంతేకాదు ఇతర ప్రావిన్సుల మాదిరిగానే, జిలిన్ కూడా ప్రసూతి, పితృత్వ సెలవులను పొడిగించింది.

Read more :  పిల్లల్ని కనటం..అమ్మటం అదే భార్యాభర్తల వ్యాపారం

కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో జియాంగ్జీలోని ఆగ్నేయ ప్రావిన్స్‌లోని బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ ప్రస్తుతం బిడ్డను కలిగి ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని రుణాలు ఇచ్చేలా ప్రోత్సహించడంపై విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత బ్యాంకు ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదని భావించి ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నామని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు