China population crisis :చైనాలో పెరిగిపోతున్న‘బ్యాచిలర్స్’..పెళ్లి అంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు..

చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెళ్లిళ్లు చేసుకోమని..పిల్లల్ని కనమని ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. కానీ చైనాలో యువకులు మాత్రం పెళ్లి అంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే..

China population crisis :చైనాలో పెరిగిపోతున్న‘బ్యాచిలర్స్’..పెళ్లి అంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు..

China Population Crisis

China Youth Fears to Marry : పెళ్లి అంటే ఏ యువకులైనా ఎగిరి గంతేస్తారు. కానీ పాపం చైనాలో యువకులు మాత్రం పెళ్లి చేసుకోవటానికి భయపడిపోతున్నారట. పెళ్లి పేరు ఎత్తితే చాలు ఏదో చేయకూడనిది అన్నట్లుగా భయపడుతున్నారట. దీంతో పెళ్లికాని ప్రసాదులు చైనాలో పెరిగిపోతున్నారు. ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం ఏది అంటే ఠక్కున చెప్పేస్తాం చైనా అని. కానీ చైనాలో అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవటానికి ఇష్టపడకపోవటంతో ఆ ప్రభావం చైనా జనాభాపై పడనుంది. అదే జరుగుతోంది చైనాలో. గత కొంతకాలంగా అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవటానికి ఇష్టపడకపోవటంతో దేశంలో ఓ పక్క వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. జననాలు తగ్గిపోవటంతో చైనా ‘జనాభా సంక్షోభాన్ని’ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంటోంది. చైనాలో తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల శిశు జననాల రేటు తగ్గటానికి దారి తీస్తోంది.

Read more : China`s population policy: ముగ్గురు పిల్లలను కనడానికి చైనా అనుమతి

చైనాలో వరుసగా ఏడేళ్లపాటు వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయాయని అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వృద్ధుల సంఖ్య పెరుగుదలతో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో 2016లో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుమందు ప్రభుత్వం ఒకే బిడ్డ నినాదం నిబంధన రద్దు చేసి.. దంపతులు ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతించింది. అయినా జనాభా సంక్షోభంలో సరైన మార్పులు రాలేదు. దీంతో ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది.పిల్లల్ని కనటానికి నిబంధనలు పెట్టిన చైనా..అదే నిబంధనలను రదుదు చేసి..పెళ్లిళ్లు చేసుకోండిరా బాబూ..పిల్లల్ని కనండిరా బాబూ అంటున్నా..చైనా యువత పెళ్లంటే ఎందుకు ముఖం చాటేస్తోంది? దాని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం..

చైనాలో ఏడాదికేడాదికి పెళ్లిళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ‘చైనా ఇయర్ బుక్ 2021’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో గతేడాది పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు.అధిక జనాభాను అరికట్టేందుకు దశాబ్దాలుగా చైనా చేపట్టిన చర్యలు ఆ దేశాన్ని వృద్ధ దేశంగా మార్చాయి. దీంతో కాస్త ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన డ్రాగన్ ప్రభుత్వం 2016లో ఏకైక సంతానం నిబంధనలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల కూడా ఆశించిన ఫలితం లేకపోవడంతో 2021లో ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది. అయినా పెళ్లి అనే యువత భయపడిపోతోంది.

Read more : China Ban Viral Song : ఆసియా దేశాల్లో వైరల్ అవుతున్న పాటను బ్యాన్ చేసిన చైనా

పెళ్లి చేసుకోవటమే ఇష్టంలేదంటుంటే..ఎంతమంది పిల్లలకు అనుమతిస్తే మాకేంటీ?అంటోంది యువత. పెళ్లిపై యువత ఇంతగా నైరాశ్యం పెంచుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పిల్లల చదువుల ఖర్చు భారంగా మారడం, ఉద్యోగం, వ్యాపారాల్లో పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి, అమ్మాయి సంఖ్య తగ్గటం..మరోపక్క అమ్మాయిలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం..దానికి తగినట్లుగానే వరుడు కావాలనే నిర్ణయాలు వంటి పలు కారణాలతో యువకులు పెళ్లి అంటేనే భయపడుతున్న పరిస్థితి.

దీనికితోడు అక్కడ స్త్రీలకంటే పురుషుల సంఖ్య ఏకంగా 3.49 కోట్లు ఎక్కువగా ఉంది. 20 ఏళ్లలోపు వయసున్న యువత సంఖ్య అయితే మహిళల కంటే 17.5 కోట్లు ఎక్కువని తేలింది. దీంతో యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. అంతేకాదు..అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. 43 శాతం మంది అమ్మాయిలు పెళ్లి అంటే ఇష్టపడట్లేదని ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. ఇలా తరచి చూస్తే..యువత పెళ్లి చేసుకోకపోవటానికి బోలెడు కారణాలున్నాయి.

కాగా..చైనాలో 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి జనాభా ప్రస్తుతం 26.4కోట్లుగా ఉంది. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 18.7శాతంతో సమానం. తాజా జనాభా లెక్కల ప్రకారం.. 21 ఏళ్లుగా చైనాలో సగటు వార్షిక వృద్ధుల జనాభా పెరుగుదల రేటు దాదాపు 63 లక్షలుగా ఉంది. 2023 నుంచి ఈ సంఖ్య ఏడాదికి కోటి మంది చొప్పున మారనుందని చైనా డైలీ రిపోర్ట్​ అంచనా వేసింది. 2036 నాటికి చైనాలో వృద్ధుల జనాభా 29.1శాతానికి చేరుతుందని చెప్పింది.