China Ban Viral Song : ఆసియా దేశాల్లో వైరల్ అవుతున్న పాటను బ్యాన్ చేసిన చైనా

ఆసియా దేశాల్లో వైరల్ అవుతున్న ఓ పాప్ సాంగ్ ను చైనా బ్యాన్ చేసింది. పింక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సాంగ్ ను చైనా బ్యాన్ చేసింది.

China Ban Viral Song : ఆసియా దేశాల్లో వైరల్ అవుతున్న పాటను బ్యాన్ చేసిన చైనా

China Baned Namewees Viral Pop Song Fragile

china bans namewees viral pop song : ఆసియా దేశాల్లో వైరల్ గా మారిన ఓ పాటను చైనా బ్యాన్ చేసింది. మలేషియా ర్యాప‌ర్ నేమ్‌వీ పాడిన ఫ్రెజైల్ సాంగ్ ఇప్పుడో సెన్షేష‌న్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిని పాట‌కు జ‌నం ఫిదా అవుతున్నారు. ఈ పాట‌లో మలేషియా ర్యాప‌ర్ నేమ్‌వీతో పాము మ‌రో స్టార్ సింగ‌ర్ చెన్ కూడా ఉంది. పింక్‌తో జాగ్ర‌త్త అంటూ సాగే ఈ పాట చైనా క‌మ్యూనిస్టుల‌ను టార్గెట్ చేసినట్లుగా చైనా భావిస్తోంది. దీంతో ఈ పాటను చైనా బ్యాన్ చేసింది.

Read more : Crude oil : పెట్రోల్ ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం..సంపన్న దేశాల బాటలో భారత్

పింక్‌తో జాగ్ర‌త్త అంటూ సాగే ఈ పాట తెగ వైరల్ అవుతో న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. దీనిపై చైనా భగ్గుమంటోంది. పింక్ తో జాగ్రత్త అనే పాట చాలా సాఫ్ట్‌గా రాసిన‌ట్లు ఉన్నా.. డ్రాగ‌న్ క‌మ్యూనిస్టుల‌ను టార్గెట్ చేసిన‌ట్లు పాట సాగుతోంది. చైనా జాతీయ‌వాదుల‌ను త‌ప్పుప‌డుతున్న రీతిలో ఈ సాంగ్ ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో ఈ వైరల్ సాంగును చైనాలో బ్యాన్ చేశారు.

Read more : Tarrif Hike : సామాన్యులపై మరో భారం.. మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు..

ఈ పాటకు కోట్లకొద్దీ వ్యూవ్స్ వ‌చ్చాయి. వస్తునే ఉన్నాయి. ఈ పాటలో చైనా ప్ర‌భుత్వానికి తొత్తుగా మారిన జాతీయ‌వాదుల‌ను ఉద్దేశిస్తూ లిటిల్ పింక్స్ ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. సాంగ్ మొత్తం పింక్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. పాట పిక్చరైజేషన్ లో కూడా పింకే ఎక్కువగా కనిపిస్తోంది. పాట‌లో కొన్ని ప‌దాల‌ను ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిన‌ట్లు ఉన్నాయ‌ంటోంది చైనా. ప్ర‌స్తుతం ఈ సాంగ్ తైవాన్‌, హాంగ్‌కాంగ్‌, మ‌లేషియా, సింగ‌పూర్ లాంటి దేశాల్లో వైర‌ల్ అయ్యింది. ఈ పాట‌ను రాసింది ర్యాప‌ర్ నేమ్‌వీనే.