Joe Biden: అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నందుకు జో బైడెన్ బాధపడుతున్నారా?

మొదట అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలబడిన బైడెన్‌.. ఈ ఏడాది జూలైలో ఆ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Trump and Joe Biden

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ చింతిస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. తాను ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే రిపబ్లిక్‌ నేత డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేవాడినని బైడెన్ ఇప్పుడు భావిస్తున్నట్లు చెప్పింది.

మొదట అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగిన బైడెన్‌.. ఈ ఏడాది జూలైలో ఆ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్‌పై డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీ చేసి ఓడిపోయారు. హారిస్ అటు ఎలక్టోరల్ కాలేజీ, ఇటు పాపులర్ ఓట్ రెండింటిలోనూ ట్రంప్‌పై ఓటమిని చవిచూశారు. ఈ ఓటమికి హారిస్‌దే బాధ్యతని బైడెన్ అనకపోయినప్పటికీ, తాను పోటీలో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని బైడెన్‌ భావిస్తున్నట్లు ది గార్డియన్‌ మీడియా పేర్కొంది.

అయితే, హారిస్ మద్దతుదారులు మాత్రం మరోలా వాదన వినిపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకునే క్రమంలో బైడెన్ ఆలస్యం చేశారని, దీంతో హారిస్ తన ప్రచారంలో సమగ్రంగా పాల్గొనలేకపోయారని చెప్పారు.

అలాగే, మెరిక్ గార్లాండ్‌ను అటార్నీ జనరల్‌గా ఎంపిక చేయడంపై కూడా బైడెన్ పశ్చాత్తాపపడుతున్నట్లు గార్డియన్ పత్రిక చెప్పింది. న్యాయశాఖపై అమెరికా ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి జనవరి 6 క్యాపిటల్‌పై దాడి ఘటన తర్వాత గార్లాండ్, మాజీ అప్పీలేట్ న్యాయమూర్తిని నియమించారు. క్యాపిటల్‌పై దాడి ఘటనలో ట్రంప్‌పై విచారణ జరిపే విషయంలో గార్లాండ్‌ వ్యవహరించిన తీరుపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

NIrmala Sitaraman: మధ్య తరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పనుందా.. అదేమిటంటే..?