Iran President Cancel Interview: జర్నలిస్ట్‭కు హెడ్ స్కార్ఫ్ లేదని ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసిన ఇరాన్ అధ్యక్షుడు

ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం కోసం న్యూయార్క్ వచ్చిన ఆయనకు అమెరికా గడ్డపై ఇదే మొదటి ఇంటర్వ్యూ. వారాల ప్రక్రియ, ఎనిమిది గంటల పాటు శ్రమించి ట్రాన్స్‭లేట్ సంబంధిత ఏర్పాట్లు, లైట్లు, కెమెరాలు ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ రైసీకి సంబంధించిన ఎలాంటి సమాచారం రాలేదు. ఇంటర్వ్యూ ప్రారంభం కావడానికి సరిగ్గా 40 నిమిషాల ముందు రైసీ సహాయకుడు ఒకరు వచ్చారు. ఇది పవిత్రమైన మొహర్ర మాసమని నన్ను తలకు స్కార్ఫ్ వేసుకొమ్మని కోరాడు.

Iran President Cancel Interview: ఇరాన్ దేశంలో హిజాబ్ వివాదం అట్టుడికి పోతోంది. వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‭లు తగలబెడుతున్నారు. జుట్టు కత్తిరిస్తున్నారు. ప్రభుత్వానికి, ఇస్లాం సంప్రదాయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, నినాదాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ క్రిస్టియానె అమాంపౌర్.

ముందుగా ఆయనతో ఇంటర్వ్యూ గురించి మాట్లాడారు. అందుకు ఆయన ఒప్పుకున్నారు. అయితే మరి కాసేపట్లో ఇంటర్వ్యూ ప్రారంభమౌతుందనగా ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తలపై ధరించే స్కార్ఫ్ వేసుకోలేదని ఇంటర్వ్యూ రద్దు చేశారు ఇరాన్ అధినేత. ఇంటర్వ్యూ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు రైసీ సహాయకుడు స్టూడియోకు వచ్చి స్కార్ఫ్ వేసుకొమ్మని చెప్పారట. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంటర్వ్యూను రద్దు చేస్తున్నట్లు రైసీ సహాయకుడు తెలిపారు.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం మోదీతోనే.. ఐక్య రాజ్య సమితిలో మెక్సికో ప్రతిపాదన

ఈ అనుభవంపై క్రిస్టియానె తన అధికారిక ట్విట్టర్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు. ‘‘మొరాలిటీ పోలీసుల తీరుతో మహ్సా అమిని ప్రాణాలు కోల్పోయిన అనంతరం ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. హిజాబ్‭లు తగలబెబుతున్నారు. మానవ హక్కుల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆందోళనలో ఎనిమిది మంది మరణించారు. దీంతో ఇరాన్ అధ్యక్షుడు రైసీని కొన్ని ప్రశ్నలు అడగాలని ప్రణాళిక వేసుకున్నాను.

ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం కోసం న్యూయార్క్ వచ్చిన ఆయనకు అమెరికా గడ్డపై ఇదే మొదటి ఇంటర్వ్యూ. వారాల ప్రక్రియ, ఎనిమిది గంటల పాటు శ్రమించి ట్రాన్స్‭లేట్ సంబంధిత ఏర్పాట్లు, లైట్లు, కెమెరాలు ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ రైసీకి సంబంధించిన ఎలాంటి సమాచారం రాలేదు. ఇంటర్వ్యూ ప్రారంభం కావడానికి సరిగ్గా 40 నిమిషాల ముందు రైసీ సహాయకుడు ఒకరు వచ్చారు. ఇది పవిత్రమైన మొహర్ర మాసమని నన్ను తలకు స్కార్ఫ్ వేసుకొమ్మని కోరాడు.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్

నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. మేమున్నది న్యూయార్క్‭లో. తలపై స్కార్ఫ్ ధరించాలని ఇక్కడ అలాంటి చట్టాలు కానీ సంప్రదాయాలు కానీ లేవు. గతంలో నేను ఇరాన్ బయట ఇరాన్ అధ్యక్షుల్ని ఇంటర్వ్యూ చేసిన సందర్భాల్ని గుర్తు చేశాను. కానీ నేను స్కార్ఫ్ వేసుకోకపోతే ఇంటర్వ్యూ సాధ్యం కాదని అతడు నాకు చెప్పాడు. ఇరాన్‭లోని పరిస్థితుల దృష్ట్యా ఇది గౌరవానికి సంబంధించిన విషయమని అన్నాడు. కానీ ఈ అనూహ్య ప్రతిపాదనకు నేను ఒప్పుకోలేదు. అంతే వాళ్లు వెళ్లిపోయారు. ఇంటర్వ్యూ ఆగిపోయింది. ఇరాన్‭లో నిరసన కొనసాగుతోంది. మనుషులు చనిపోతున్నారు. ఇంత ముఖ్యమైన అంశం మీద ఇరాన్ అధ్యక్షుడు రైసీ తప్పనిసరిగా మాట్లాడాలి’’ అని క్రిస్టియానె వరుస ట్వీట్లు చేశారు.

Congress President Election: ఆ మాట నాతో రాహుల్ చెప్పారు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై అశోక్ గెహ్లోత్

ట్రెండింగ్ వార్తలు