Russia Ukraine Crisis
Russia-Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సిద్ధమైంది. తూర్పు ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల అనంతరం.. యుక్రెయిన్ ఆక్రమణకు రష్యా వేగంగా అడుగులేస్తోంది. దేశం వెలుపల ఆర్మీ దళాలకు రష్యా పార్లమెంట్ అనుమతి ఇవ్వడంతో.. యుక్రెయిన్‌లోకి రష్యా బలగాలు అధికారికంగా ప్రవేశించాయి.
దీంతో అధికారికంగా యుద్ధం మొదలైనట్లేన్న సంకేతాలు కనిపిస్తుండడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా అన్ని దేశాల ప్రభుత్వాలు.. ప్రజలు ఈ రెండు దేశాల మధ్య వివాదం ఎటు దారి తీస్తోందా అని ఆసక్తిని మించి ఆందోళనకరంగా చూస్తున్నాయి. భారత్ కూడా ఇప్పటికే యుక్రెయిన్ లోని భారత ప్రజల కోసం చర్యలు మొదలు పెట్టగా.. వాళ్ళని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
Russia-Ukraine Crisis : తగ్గేదేలే అంటున్న యుక్రెయిన్.. ఎమర్జెన్సీ విధిస్తూ సంచలన నిర్ణయం
ఈ దేశాల మధ్య ఉద్రిక్తల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ప్రపంచ ప్రజలు వార్త ఛానెళ్లపైనే ఆధారపడుతున్నారు. అందుకోసం టీవీ చానెళ్లు సైతం ప్రజలకు ఈ ఉద్రిక్తలను అర్ధమయ్యేలా విశ్లేషించి అందిస్తున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ మాత్రం యుక్రెయిన్ నుండి ఏకంగా ఒకేసారి ఆరు భాషలలో రిపోర్టింగ్ చేస్తూ సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు.
Russia-Ukraine Crisis: రష్యా సామ్రాజ్యాన్ని పునరుద్దరించే ఆలోచన లేదన్న పుతిన్
అమెరికా రిపోర్టర్ ఫిలిప్ క్రౌథర్ యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి ఇంగ్లీష్, లగ్జెమ్బర్గీస్, స్పానిష్, ఫోర్చుగీసు, ఫ్రెంచ్, జర్మనీ భాషలలో వార్తలు అందిస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ఫిలిప్ వార్తలు చూసే నెటిజన్లు ఆయన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు.