Russia-Ukraine Crisis : తగ్గేదేలే అంటున్న యుక్రెయిన్.. ఎమర్జెన్సీ విధిస్తూ సంచలన నిర్ణయం

ర‌ష్యా, యుక్రెయిన్ మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌దా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ భ‌యాందోళ‌న‌లు మ‌రింత పెరిగాయ‌నే చెప్పాలి. తాము కూడా ఏమాత్రం త‌గ్గేది లేద‌న్న‌ట్లుగా యుక్రెయిన్..

Russia-Ukraine Crisis : తగ్గేదేలే అంటున్న యుక్రెయిన్.. ఎమర్జెన్సీ విధిస్తూ సంచలన నిర్ణయం

Russia-Ukraine Crisis : ర‌ష్యా, యుక్రెయిన్ల మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌దా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ భ‌యాందోళ‌న‌లు మ‌రింత పెరిగాయ‌నే చెప్పాలి. ర‌ష్యా త‌న సైనిక బలగాలను యుక్రెయిన్ స‌రిహ‌ద్దులకు త‌ర‌లిస్తోంది. తాము కూడా ఏమాత్రం త‌గ్గేది లేద‌న్న‌ట్లుగా యుక్రెయిన్ వ్యవహరిస్తోంది. యుక్రెయిన్ కూడా స‌మ‌ర స‌న్నాహాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా దేశంలో ఎమ‌ర్జెనీని విధిస్తూ యుక్రెయిన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

యుక్రెయిన్‌లో నెల రోజుల పాటు ఎమ‌ర్జెన్సీ అమ‌ల్లో ఉంటుందని యుక్రెయిన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. దేశంలోని ప‌లు కీల‌క ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుందని తెలిపింది. కాగా, ప్రస్తుత పరిణామాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చేశాయి. యుక్రెయ‌న్ కూడా యుద్ధ స‌న్నాహాల్లో నిమ‌గ్న‌మైంద‌న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?

మరోవైపు దక్షిణ బెలారస్‌లో యుక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలోకి రష్యా సేనలు చేరుకున్నాయి. ఇక్కడ మోహరించిన బలగాలకు అవసరమైన రవాణా సౌకర్యాలను, ఇతర సామగ్రిని తరలిస్తున్నారు. దక్షిణ బెలారస్‌లోని మోజ్యార్‌ ఎయిర్‌ ఫీల్డ్‌ దగ్గర దాదాపు 100 వాహనాలు, డజన్లకొద్దీ గుడారాలు వెలిశాయి. ఈ ఎయిర్ పోర్టు.. యుక్రెయిన్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Russia-Ukraine crisis Ukraine security council calls for state of emergency

Russia-Ukraine crisis Ukraine security council calls for state of emergency

మరోవైపు పశ్చిమ రష్యాలోని పోచెప్‌ దగ్గర అదనపు బలగాలను అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బెల్గ్రోడ్‌ దగ్గర సైనిక స్థావరం సమీపంలో ఒక ఫీల్డ్‌ హాస్పిటల్‌ కొత్తగా వెలిసింది. దీంతోపాటు యుక్రెయిన్‌కు 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. తూర్పువైపున యుక్రెయిన్‌ సరిహద్దులకు 40 కిలోమీటర్ల దూరంలో ట్యాంకులు, ఇతర భారీ శతఘ్నులను తరలించే హెవీ ఎక్వీప్‌మెంట్‌ ట్రాన్స్‌పోర్టర్లు కనిపించాయి.

Russia : యుక్రెయిన్‌పై పంజా విసురుతున్న రష్యా.. ఆర్థిక ఆంక్షలను పట్టించుకోని పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. అనుకున్నది చేశారు. యుక్రెయిన్‌ సార్వభౌమత్వానికి పెను సవాల్ విసిరారు. తూర్పు యుక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వేర్పాటువాద భూభాగాలను స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతాలుగా గుర్తిస్తూ సోమవారం(ఫిబ్రవరి 21) రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో ఈ ప్రాంతాలు స్వతంత్రత ప్రకటించుకున్నప్పుడు నిర్ణయించుకున్న సరిహద్దులే వాటికి ఉంటాయని ప్రకటించారు. నాటోలో సభ్యత్వం పొందకుండా, ఆయుధాలను ఇతర దేశాల నుంచి పొందకుండా యుక్రెయిన్‌ను అడ్డుకునేందుకు ఈ దిశగా అడుగువేశారు. యుక్రెయిన్‌ ప్రభుత్వంతో, పాలనతో ఇకపై ఈ ప్రాంతాలకు ఎలాంటి సంబంధాలు ఉండవని తెలిపారు. ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట సేనలను పంపించాలని నిర్ణయించారు.

Russia-Ukraine crisis Ukraine security council calls for state of emergency

Russia-Ukraine crisis Ukraine security council calls for state of emergency

రష్యా వెలుపల సైనిక బలగాల వినియోగానికి తమ దేశ చట్టసభ అనుమతి కూడా పుత్తిన పొందారు. అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా రష్యా యుద్ధ ట్యాంకులు, సైనిక బలగాలు కదిలాయి. క్రిమియాను తమ దేశంలో భాగంగా గుర్తించాలని కూడా అంతర్జాతీయ సమాజానికి పుతిన్‌ పిలుపునిచ్చారు. కాగా, పుతిన్‌ నిర్ణయం యుక్రెయిన్‌ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని ప్రపంచ దేశాలు మండిపడ్డాయి.

పుత్తిన్ తీరును తప్పుపడుతూ.. రష్యాపై ఆంక్షల కత్తి ఝళిపించడం ప్రారంభించాయి. యూఎన్ఓ భద్రతామండలి అత్యవసరంగా సమావేశమై పరిణామాన్ని ఖండించింది. రష్యా చర్య దురాక్రమణ కిందికే వస్తుందని అమెరికా ప్రకటించింది. వేర్పాటువాదుల ప్రాంతంలో పెట్టుబడులు, వాణిజ్యాన్ని నిషేధిస్తూ అధ్యక్షుడు బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా నుంచి తమ దేశానికి గ్యాస్‌ తరలించే కీలకమైన ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది.