Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?

రష్యా యుక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. యుక్రెయిన్ సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?

Why Are Expensive In India Ukraine Russia

Russia-Ukraine War : రష్యా యుక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. యుక్రెయిన్ సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ రష్యా-యుక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు మొదలయ్యాయి. దేశంలో నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. దేశంలో ప్రధాన నిత్యావసరాలైన సహజ వాయువు నుంచి గోధుమ వరకు.. వివిధ వస్తువుల ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

నేచురల్ గ్యాస్ ధర భారీగా పెరగొచ్చు :
రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో దేశంలో నేచురల్ గ్యాస్ ధర భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుక్రెయిన్-రష్యా సంక్షోభ ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96.7 డాలర్లకు పెరిగింది. సెప్టెంబర్ 2014 నుంచి అత్యధిక స్థాయిలో నమోదు అయింది. వాస్తవానికి ముడి చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా ఒకటిగా ఉంది. ప్రస్తుత సంక్షోభంతో రాబోయే రోజుల్లో బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే ఎక్కువ ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల ప్రపంచ జీడీపీపై పెనుప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Why Are Expensive In India Ukraine Russia (1)

Why Are Expensive In India Ukraine Russia

చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరగడంతో ప్రపంచ GDP వృద్ధిని 0.9 శాతానికి తగ్గిస్తుందని JP మోర్గాన్ విశ్లేషించింది. అయితే, టోకు ధరల సూచీ (WPI), ముడి చమురు సంబంధిత ఉత్పత్తులు 9 శాతానికి పైగా ప్రత్యక్ష వాటాను కలిగి ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరల పెరుగుదలతో భారత WPI ద్రవ్యోల్బణం దాదాపు 0.9 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా, యుక్రెయిన్‌తో యుద్ధానికి దిగితే దేశీయ సహజ వాయువు (CNG,, PNG, electricity) ధర 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

పెరగనున్న పెట్రోలు, డీజిల్ ధరలు :
గతంలోనూ అధిక ముడి చమురు ధరలు భారత్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీశాయి. 2021లో ఇంధన ధరల పరంగా దేశంలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా-యుక్రెయిన్ సంక్షోభం ఇలాగే కొనసాగితే.. భారత్ పెట్రోల్-డీజిల్ ధరలను భారీగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశవ్యాప్తంగా మొత్తం దిగుమతుల్లో దాదాపు 25 శాతం చమురును ఇక్కడి నుంచే వస్తోంది. భారత్ తన చమురు అవసరాలలో 80 శాతానికి పైగా ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గోధుమల ధర పెరగవచ్చు :
నల్ల సముద్రం ప్రాంతం నుంచి ధాన్యం సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చు.. ఇదే జరిగితే.. అధిక ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంధన ఆహార ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రష్యా ప్రపంచంలోనే గోధుమ ఎగుమతుల్లో అగ్రాగామిగా కొనసాగుతోంది. యుక్రెయిన్ నాల్గవ అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా ఉంది. మొత్తం గ్లోబల్ ఎగుమతుల గోధుమలలో దాదాపు నాలుగింట ఒక వంతు ఈ రెండు దేశాల వాటానే ఎక్కువ.. ఇటీవలి ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. సరఫరా గొలుసులపై మహమ్మారి ప్రభావం కారణంగా ఆహార ధరలు ఇప్పటికే ఒక దశాబ్దానికి పైగా అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ఆహార ధరలలో అస్థిరత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడి వృద్ధికి ముప్పు కలిగించేలా కనిపిస్తోంది.

లోహాల ధర పెరగొచ్చు :
రష్యాపై ఆంక్షల భయాల మధ్య ఆటోమోటివ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్, మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే పల్లాడియం అనే మెటల్ ధర ఇటీవలి వారాల్లో భారీగా పెరిగింది. పల్లాడియం ఎగుమతిలో రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. రష్యాపై ఆంక్షలను కఠినతరం చేస్తే.. రాబోయే రోజుల్లో లోహాల ధరలు కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : Top cryptocurrency prices today : యుక్రెయిన్‌ సంక్షోభం ఎఫెక్ట్ : భారీగా క్షీణించిన క్రిప్టో కరెన్సీ ధరలు..