Top cryptocurrency prices today : యుక్రెయిన్‌ సంక్షోభం ఎఫెక్ట్ : భారీగా క్షీణించిన క్రిప్టో కరెన్సీ ధరలు..

యుక్రెయిన్‌పై రష్యా దాడికి అధిక అవకాశం ఉందనే ఉద్రిక్తతల మధ్య క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా క్షీణించింది. యుద్ధం వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Top cryptocurrency prices today : యుక్రెయిన్‌ సంక్షోభం ఎఫెక్ట్ : భారీగా క్షీణించిన క్రిప్టో కరెన్సీ ధరలు..

Top Cryptocurrency Prices Today Bitcoin, Ethereum Drop 5percent, Shiba Inu, Dogecoin Lose 10percent

Updated On : February 22, 2022 / 10:38 PM IST

Top cryptocurrency prices today : యుక్రెయిన్‌పై రష్యా దాడికి అధిక అవకాశం ఉందనే ఉద్రిక్తతల మధ్య క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా క్షీణించింది. యుద్ధం వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని విత్ డ్రా చేసుకున్నారు. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతోంది. అన్ని టాప్ డిజిటల్ టోకెన్లు క్షీణించాయి.

15 శాతం తగ్గి, ప్రధాన ఆల్ట్‌కాయిన్‌లలో 10-12 శాతం పడిపోయాయి. Dogecoin, Shiba Inu వంటి మీమ్ టోకెన్లు ఒక్కొక్కటిగా 10 శాతం మేర పడిపోయాయి. Bitcoin, Ethereum ఒక్కొక్కటి 5 శాతం పడిపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 6 శాతం పడిపోయి 1.67 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. మొత్తం క్రిప్టో మార్కెట్ పరిమాణం 43 శాతం కంటే ఎక్కువ పెరిగి 01.33 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది.

Top Cryptocurrency Prices Today Bitcoin, Ethereum Drop 5percent, Shiba Inu, Dogecoin Lose 10percent (1)

Top Cryptocurrency Prices Today Bitcoin, Ethereum Drop 5percent, Shiba Inu, Dogecoin Lose 10percent

బిట్ కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గింది. రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. రష్యా ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రభావం క్రిప్టో కరెన్సీపై పడింది. క్రిప్టో కరెన్సీల పెట్టుబడుల్లో బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తున్నాయి. ఇక మార్కెట్‌ అస్థిరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ మార్కెట్లో రూ.24.24 లక్షలుగా కొనసాగుతోంది. ఇతర కరెన్సీ విలువలు కూడా భారీగా పడిపోయాయి.

అన్ని చెల్లింపు లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. చట్టపరమైన విధాన రంగాలలో అనిశ్చితులు ఉన్నప్పటికీ గ్లోబల్ ఇండియన్ క్రిప్టో వెంచర్‌లలో నిధులు 2021లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఒనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. అంతేకాదు.. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు.

Read Also : Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధమేనా? ఆర్‌బీఐ ప్రతిపాదన ఇదే.. కేంద్రం ఏం ఆలోచిస్తోంది?