Russia-Ukraine Crisis: రష్యా సామ్రాజ్యాన్ని పునరుద్దరించే ఆలోచన లేదన్న పుతిన్
యుక్రెయిన్ ను ఆక్రమించుకుని రష్యా తన సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించాలనుకుంటున్నట్లు వచ్చిన ఊహాగానాలను ఆదేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు.

Putin
Russia-Ukraine Crisis: యుక్రెయిన్ ను ఆక్రమించుకుని రష్యా తన సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించాలనుకుంటున్నట్లు వచ్చిన ఊహాగానాలను ఆదేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. మంగళవారం రష్యా టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. “యుక్రెయిన్ నిజమైన దేశం కాదు, తన సొంత ప్రామాణిక రాజ్యాధికారాన్ని ఎన్నడూ కలిగి లేదు. యుక్రెయిన్లో స్థిరమైన రాజ్యాధికారం ఎప్పుడూ లేదు, అందుకే దాన్ని ఒక ప్రామాణిక దేశంగా పరిగణించడం లేదు” అంటూ పుతిన్ వ్యాఖ్యానించారు. యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. ఇప్పటికే రష్యన్ దళాలను యుక్రెయిన్ లోని ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also read: India : యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులు స్వదేశానికి..ఎయిరిండియా ప్రత్యేక విమానాలు
ఇప్పటికే యుక్రెయిన్ లోని డొనెట్స్క్, లుహాన్స్క్ భూభాగాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ పుతిన్ ప్రకటన చేశారు. ఆ రెండు ప్రాంతాల్లో యుక్రెయిన్ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రష్యన్ సైనికులను మోహరింపజేశారు. అయితే యుక్రెయిన్ ను ఆక్రమించుకుని రష్యా సామ్రాజ్యాన్ని పునర్నిర్మించుకోవాలనే ఆలోచేనే లేదంటూనే .. మరో వైపు యుక్రెయిన్ పై దండయాత్ర చేస్తుండడంతో పుతిన్ ఆలోచన అంతుబట్టకుండా ఉంది. రష్యా చారిత్రాత్మక భూభాగంలో యుక్రెయిన్ కూడా ఒక భాగమని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పుతిన్ అన్నారు. చరిత్రలో యుక్రెయిన్ ప్రజలకు విలక్షణమైన సంస్కృతి ఉన్నట్లు విస్తృత ఆధారాలు ఉన్నప్పటికీ..అసలు సోవియెట్ యూనియన్ కోసమే ఆ దేశాన్ని సృష్టించారని పుతిన్ వ్యాఖ్యానించారు.
Also read: USA : రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన అమెరికా
మొదటి తరం రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ ఆధ్వర్యంలో యుక్రెయిన్ ను సృష్టించినట్లు పుతిన్ గుర్తుచేశారు. 1700ల కాలం నాటి నుంచి తూర్పు ఐరోపాలో విస్తారమైన సామ్రాజ్యానికి రష్యా కేంద్రంగా ఉంది. ప్రస్తుత యుక్రెయిన్ సహా ఇతర ప్రాంతాలు రష్యాలో అంతర్భాగంగా ఉండేవి. సోవియట్ యూనియన్ ఏర్పడిన తరువాత ఆ ప్రాంతాలు ఎక్కువగా మాస్కో ఆధీనంలోనే ఉన్నాయి. కానీ సోవియట్ యూనియన్ కూలిపోవడంతో 1990లలో యుక్రెయిన్ సహా అనేక ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఇదే విషయాన్ని పుతిన్ ప్రస్తావిస్తూ యుక్రెయిన్ కేవలం తమ పొరుగు దేశం మాత్రమే కాదని.. రష్యా సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు.
Also read: Ukraine-Russia: యుక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం
“నేను మరోసారి నొక్కి చెబుతున్నాను. ఇది మన స్వంత చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక అంతర్భాగం. యుక్రెయిన్లు మా కామ్రేడ్లు, వీరిలో సహోద్యోగులు, స్నేహితులు, మాజీ సహోద్యోగులు మాత్రమే కాదు, బంధువులు, రక్తసంబంధీకులు, కుటుంబ సంబంధాల ద్వారా మాతో దృఢంగా పెనవేసుకుపోయారు” అంటూ పుతిన్ చెప్పుకొచ్చారు. తెరిచిన పుస్తకం లాంటి చరిత్ర గురించి తాను ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదని..అయినప్పటికీ యుక్రెయిన్ ను ఆక్రమించుకోవాలనే ఆలోచనే లేదని పుతిన్ అన్నారు. అయితే యుక్రెయిన్ కు నాటో సభ్యత్వంపై మాత్రమే తాము అభ్యంతరం తెలుపుతున్నట్లు పుతిన్ వివరించారు.
Also read: Ukraine Crisis : యుక్రెయిన్ గగనతలంలో అమెరికా స్పై విమానాలు