Ukraine-Russia: యుక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.

Ukraine-Russia: యుక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

Air India

Ukraine-Russia: రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో యుక్రెయిన్ లో నివసిస్తున్న భారత విద్యార్థులు, పౌరులు వెంటనే స్వదేశానికి రావాలంటూ భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు..భారత విద్యార్థులు, పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో బుధవారం తెల్లవారు జామున 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది. విద్య, వ్యాపారం నిమిత్తం సుమారు 20 వేల మంది భారతీయులు యుక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. యుద్ధ భయానకంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారత రాయబార కార్యాలయం తక్షణమే భారత్ కు తిరిగి వెళ్లిపోవాలని సూచించింది.

Also read: Ukraine Crisis : యుక్రెయిన్ గ‌గ‌న‌త‌లంలో అమెరికా స్పై విమానాలు

యుక్రెయిన్ లో పరిస్థితుల దృష్ట్యా.. అక్కడి భారతీయులను త్వరితగతిన తరలించేందుకు విమాన సర్వీసులు పెంచుతూ భారత పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మంగళవారం తెల్లవారుజామున యుక్రెయిన్ వెళ్లి.. తిరిగి బుధవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. వందే భారత్ మిషన్ లో భాగంగా జరుగుతున్న తరలింపు ప్రక్రియలో 242 మంది భారత పౌరులతో కూడిన మొదటి విమానం ఢిల్లీకి చేరింది. తిరిగి ఫిబ్రవరి 24, 26న మరో రెండు విమాన సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Also read: Southwestern Burkina : గోల్డ్ మైనింగ్‌లో వరుస పేలుళ్లు.. 59మంది దుర్మరణం

ఇక యుక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారతీయ విద్యార్థులు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని వారు అన్నారు. కానీ మున్ముందు పరిస్థితులు ఉద్రిక్తంగా మారే సూచనలు ఉన్నట్లు భారత దౌత్య అధికారులు తెలిపారని, ఎంబసీ సలహాను అనుసరించి భారత్ వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి ఎయిరిండియా బోయింగ్ 787 విమానంలో బయలుదేరి, ఇక్కడకు(ఢిల్లీ) చేరుకున్నట్లు వారు వివరించారు. భారత్ తిరిగి వచ్చాక ప్రశాంతంగా ఉందని విద్యార్థులు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ తరగతులు కొనసాగవచ్చని విద్యార్థులు ఆశిస్తున్నారు.

Also read: Ukraine Crisis Putin Plan : యుక్రెయిన్‌లో ఆ Donbas ప్రాంతంలో ఏం జరుగుతోంది? ఎందుకు పుతిన్ ఇక్కడే టార్గెట్ చేశారంటే?