India : యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులు స్వదేశానికి..ఎయిరిండియా ప్రత్యేక విమానాలు

ర‌ష్యా-యుక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు రోజురోజుకు క్షీణించడంతో భార‌త విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వెంటనే భార‌తీయులంతా తిరిగి రావాల‌ని అడ్వైజరీ జారీ చేసింది.

India : యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులు స్వదేశానికి..ఎయిరిండియా ప్రత్యేక విమానాలు

Indians

Indians in Ukraine : రష్యా, యుక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. యుక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులను స్వదేశానికి తీసుకొస్తుంది. తొలి దశలో ఎయిరిండియా ప్రత్యేక విమానాన్ని యుక్రెయిన్‌కు పంపిన భారత్.. అక్కడి నుంచి 242 మంది భారతీయులను ఢిల్లీకి చేర్చింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ కోసం డ్రీమ్‌లైనర్‌ బీ-787 విమానాన్ని వినియోగించింది. అలాగే ఈనెల 24, 26న కూడా యుక్రెయిన్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానాలను నడపనుంది. ఎయిరిండియాతో పాటు పలు ప్రైవేట్ సంస్థల విమానాల్లోనూ టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

ర‌ష్యా-యుక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు రోజురోజుకు క్షీణించడంతో భార‌త విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వెంటనే భార‌తీయుల‌ంతా తిరిగి రావాల‌ని అడ్వైజరీ జారీ చేసింది. యుక్రెయిన్‌లో ఉన్న భార‌త రాయ‌బార కార్యాల‌యం ఇలా సూచించ‌డం ఇది మూడోసారి. ప్రస్తుత పరిస్థితుల్లో యుక్రెయిన్‌లో ఉండడం క్షేమం కాదంటూ ప్రకటించింది. ఆన్‌లైన్ క్లాసుల విష‌యంలో ఆయా యూనివ‌ర్సిటీ అధికారుల‌తో నిరంత‌రం సంప్రదింపులు జ‌రుపుతున్నామని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. యుక్రెయిన్‌లో దాదాపు 20 వేలమంది భారత విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

Ukraine-Russia: యుక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు రష్యా దూకుడుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా వైఖరిపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో రష్యా వైఖరిని భారత్‌ తప్పుపట్టింది. యుక్రెయన్‌కు రష్యా బలగాలను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని భారత్ పిలుపునిచ్చింది. పరిస్థితులు చేయిదాటిపోతే ప్రమాదమంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

యుక్రెయిన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. యుక్రెయిన్‌లో ఉన్న 20వేలకు పైగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అన్ని వర్గాలు పనిచేయాలని భారత్ సూచించింది.

Russia-Ukraine : రష్యా-యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ భయాలు

యుక్రెయిన్‌‌ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది. తూర్పు యుక్రెయిన్‌లో రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు.

డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్టు పుతిన్‌ చెప్పారు. చాలా కాలంగా వినిపిస్తున్న ఈ రెండు ప్రాంతాల స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని తక్షణమే గుర్తించడం కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానన్నారు. వేర్పాటువాదులతో పరస్పర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై పుతిన్ సంతకం చేశారు.