“Juno Heart” cherry : ఒక్క చెర్రీ పండు ధర రూ.20,000

ఒక్క చెర్రీ పండు రేటు రూ.20,000 అంటే నమ్మశక్యంగా ఉండదు.కానీ ఇది నిజమే. 15 చెర్రీ పళ్లు ఉన్న బాక్సు రూ.3లక్షలకు అమ్ముడైంది. అంటే ఒక్క చెర్రీ పండూ రూ.20వేలు ధర పలికింది.

ఈ చెర్రీ రేటు

“Juno Heart” cherrys box Rs.3 lakhs In Japan : చెర్రీ పళ్లు. చూడటానికి ఎంత అందంగా ఉంటాయో తింటే అంతకంటే రుచిగా ఉంటాయి. అటువంటి చెర్రీలు ఓ బాక్స్ ఖరీదు ఎంతుంటుంది? మహా ఉంటే వంద రూపాయల్లో ఉంటుంది. కానీ జపాన్ లో మాత్రం వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో ఉన్నాయి. చెర్రీ పళ్ల బాక్సు రూ.3లక్షలకు పైగా ఉంది. ఈ లెక్కన లెక్కేస్తే బాక్సులో ఒక్కో చెర్రీ పండూ రూ,20,000 ఖరీదు పలుకుతోంది.

జపాన్ లోని అమోరి ప్రిఫెక్చర్, హచినోహేలోని హోల్ సేల్ మార్కెట్లో ఈ సీజన్ లో వేసిన వేలంలో 15 చెర్రీలు ఉన్న ఓ బాక్స్ 450,000 యెన్స్ అంటే ఇండియా కరెన్సీలో రూ.3లక్షలు పైనే అమ్ముడైంది. “జూనో హార్ట్” చెర్రీ రకం “జూనో హార్ట్”అనే రకం చెర్రీలను జపాన్ లోని హోన్షు ద్వీపంలో పండిస్తారు. జపాన్ లోని అమోరి ప్రిఫెక్చర్ ప్రభుత్వం వీటిని అభివృద్ది చేసింది. 31 మిల్లీ మీటర్లు లేదా అంతకంటే పెద్దవైన చెర్రీలను ‘అమెరి హార్ట్ బీట్’ పేరుతో విక్రయిస్తున్నారు.ఈ చెర్రీలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త ఎక్కువ ధర పలికాయి.

జూన్ 29న సనోహే, నాన్బు పొరుగున ఉన్న హచినోహే పట్టణాల్లో ఉత్పత్తి చేయబడిని జూనో హార్ట్ చెర్రీస్ 26 బాక్సులు, 13 అమెరి హార్ట్ బీటస్ చెర్రీస్, హచినోహే కేంద్రంలోని హోల్ సేల్ మార్కెట్ లో వేలయం వేయగా 15 చెర్రీలు ఉన్న ఓ బాక్స్ 450,000 యెన్స్ అంటే ఇండియా కరెన్సీలో రూ.3లక్షలు పైనే అమ్ముడైంది.