వైరల్ ఫోటో : అప్పుడే పుట్టిన శిశువు డాక్టర్ వంక ఎంత కోపంతో చూస్తోందో..!!

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 04:52 AM IST
వైరల్ ఫోటో : అప్పుడే పుట్టిన శిశువు డాక్టర్ వంక ఎంత కోపంతో చూస్తోందో..!!

అప్పుడే పుట్టిన బిడ్డ కళ్లు తెరిచి చూడటానికి కనీసం రెండు మూడు గంటలైనా పడుతుంది. కానీ జస్ట్ అప్పుడే పుట్టిన ఓ శిశువు డెలీవరీ చేసిన డాక్టర్ వైపు కోపంగా చూసినట్లుగా ఉండే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివారాల్లోకి వెళితే..బ్రెజిల్ లోని రియో డీజనీరోలో ఫిబ్రవరి 13న ఓ మహిళకు డాక్టర్లు డెలివరీ చేసారు. ఆమె పండండి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను డాక్టర్లు బొడ్డుతాడు కోసి ఏడిపించటానికి ప్రయత్నిస్తుండగా..ఆ శిశువు ఇచ్చిన రియాక్షన్‌కు డాక్టర్లు షాక్ అయ్యారు. కంగుతిన్నారు. ఆ బిడ్డ డాక్టర్లవైపు కోపంగా చూస్తున్నట్లుగా ఉంది. 

డాక్టర్లు ఆ బిడ్డ ఎక్స్ ప్రెషన్ ను ఫోటో తీసారు. ఈ ఫోటో తాజాగా వెలుగులోకి రావటంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. 

డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం..ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు. దీంతో వైద్యులు బొడ్డుతాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ శిశువు డాక్టర్లవైపు ఎంతో కోపంతో ఉరుముతున్నట్టు చూసింది. మొదట ఆ శిశువు చూపును గమనించిన వైద్యులు కంగుతిన్నప్పటికీ తరువాత తేరుకున్నారు. ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉందనీ..ఎటువంటి సమస్యలు లేవని..కాసేపటికి ఆ శిశువు సాధారణ శిశుల్లాగానే ఉండటంతో బిడ్డ తల్లిదండ్రులతో పాటు డాక్టర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Read More>> ట్రంప్ పర్యటన స్నేహం పెరిగేలా చేస్తుంది: మోడీ