కశ్మీర్ పాకిస్తాన్ రక్తంలోనే ఉందని పాక్ మాజీ నియంత,ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్(APML)పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఏదిఏమైనా కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు,ఆర్మీ నిలబడుతుందని ఆయన అన్నారు. తాను త్వరలోనే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆయన తెలిపారు. పాక్ శాంతి మంత్రాన్ని జపిస్తున్నా భారత్ భయపెట్టాలని చూస్తోందన్నారు. భారత్ కార్గిల్ యుద్ధాన్ని మరచిపోయిందేమో…1999లోయుద్ధం ముగిసే ముందు భారత్ అమెరికా సాయం కోరిందని ముషార్రఫ్ అన్నారు.
పాకిస్తాన్ లో వివిధ కేసులను తప్పించుకొనేందుకు దుబాయ్ కి పారిపోయిన ముషార్రఫ్…ఇస్లామాబాద్ లో APML ఫౌండింగ్ డే సందర్భంగా దుబాయ్ నుంచి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. పాకిస్తాన్ శాంతి కోరుకుంటోందని, దాన్ని తమ బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు.
1999 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్.. బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007 లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ముషార్రఫ్ పై పాకిస్తాన్ లో దేశద్రోహ కేసు నమోదైంది. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు 2016మార్చిలో ముషార్రఫ్ దుబాయ్ పారిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతూ దుబాయ్ లో ట్రీట్మెంట్ పొందుతున్నా