Pre Wedding Shoot : అరెరే ఎంతపనాయే.. బురదలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు వెళ్లిన జంటకు చేదు అనుభవం ఎదురైంది.బురదలో ఫోటోషూట్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఎవరికి గాయాలు కాకపోయినా వధువు డ్రెస్ మాత్రం రంగుమారింది

Pre Wedding Shoot

Pre Wedding Shoot : ప్రస్తుత కాలంలో ఫోటో షూట్‌లు సర్వసాధారణం అయిపోయాయి. జీవితాంతం గుర్తుండాల్సిన మధుర క్షణాలను ఫొటోల్లో బందిస్తున్నారు. చిన్న వేడుక జరిగినా ఫోటోషూట్ కామనైపోయింది. ముఖ్యంగా ప్రతి జంట పెళ్లికి ముందు వెడ్డింగ్‌ షూట్‌లు నిర్వహించుకుంటున్నారు, కొందరు తమకు సమీపంలోని మంచి లొకేషన్స్ సెలెక్ట్ చూసుకొని ఫోటోషూట్ ఏర్పాట్లు చేస్తుంటే.. మరికొందరు విదేశాలకు వెళ్లి మరి ఫోటోషూట్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఫోటోలకు ఫోజులిస్తూ కొన్ని జంటలు ప్రమాదం అంచులవరకు వెళ్ళివచ్చాయి.

చదవండి : Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

రాజస్థాన్‌లో గతేడాది ఓ జంట నది మధ్యలో చిక్కుకుపోయింది. అతికష్టం మీద వారిని బయటకు తీశారు పోలీసులు. ఇక తాజాగా ఫోటోషూట్‌కి వెళ్లిన తజకిస్థాన్ మురత్ జురాయేవ్, కమిల్లా అనే వధూవరులు పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోషూట్‌ కోసం అవుట్‌డోర్‌ లొకేషన్‌కు వెళ్లారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సూట్‌లో కెమెరాకు ఫోజులిచ్చారు. ఇదే సమయంలో వధువును చేతులపై ఎత్తుకున్న వరుడు బురద నీటిలో నడుచుకుంటూ ముందుకు కదిలాడు, బురదలో కాలు జారడంతో పడిపోయారు. దీంతో వధువు తెలుపు రంగు గౌన్‌ అంతా బురదతో నిండిపోయింది. ఇక ఇక చేసేందేం లేక జరిగింది తల్చుకొని నవ్వూతూ అక్కడి నుంచి తిరగొచ్చేశారు.

చదవండి : Firing In Wedding Ceremony : పెళ్లి జరుగుతుండగా జై శ్రీరామ్ అంటూ కాల్పులు..ఒకరు మృతి

ఇక ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూస్తుంటే అనుకోకుండా బురదలో పడినట్లుగా కనిపించడం లేదు. కావాలనే బురదలో జారిపడినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బురదలో ఎత్తుకోవడం అవసరమా అని కొందరంటే.. ప్లాన్ ప్రకారమే చేశారు గురు అంటూ మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా వధువు వైట్ డ్రెస్ కాస్త నల్లగా మారిపోయింది.