Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు..

Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

Wedding Insurance

Wedding Insurance : ప్రమాదాలు ఎలా వస్తాయో..ఎప్పుడు వస్తాయో తెలీదు..ఊహించకుండా వచ్చేదాన్నే ప్రమాదం అంటాం. అందుకే బీమా. ధీమానిచ్చే బీమా. పుడితే బీమా.. చావుకి బీమా.ఆరోగ్యానికి, వ్యాపారాలకు, వాహనాలకు, పంటలకు బీమా. ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లకు కూడా బీమా చేసుకునే సౌకర్యం వచ్చింది. ఏంటీ పెళ్లిళ్లలకు బీమానా?అని ఆశ్చర్యపోవద్దు. పెళ్లి సడెన్ గా ఆగిపోవచ్చు. అది సినిమాయే కానక్కరలేదు. పెళ్లి పీటలమీద మరో నిమిషంలో తాళి కడతారనగా కూడా పలు కారణాలతో ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. పెళ్లి ఆగిపోవటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ పెళ్లి సడెన్ గా ఆగిపోతే ఎంత నష్టం..అది పరువు నష్టమే కాదు..ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది.

Read more : Special Trains : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

అది కట్నం కావచ్చు..భోజనాలు..భాజా భజంత్రీలు..ఫంక్షన్ హాళ్లకు ఇలా ఎన్నో వాటికి చెల్లించిన డబ్బులు నష్టపోతారు. అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారికి చాలా ఆర్థిక నష్టం జరుగుతుంది. అందుకే వచ్చింది ‘వెడ్డింగ్ బీమా’. జరగాల్సిన పెళ్లి సడెన్ గా రద్దు అయితే బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. అందుకే పెళ్లికి కూడా బీమా ఉండాలంటున్నాయి బీమా కంపెనీలు..పెళ్లి రద్దు అయితే బీమా పరిహారాన్ని చెల్లిస్తామంటున్నాయి…!! మరి ఆ ‘వెడ్డింగ్ బీమా’ గురించి వివరాలు మీ కోసం..

వివాహం.. అంటే ఇద్దరు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. సంప్రదాయాలు..మంచి చెడ్డలు..ఆస్తిపాస్తులు చూసుకుని ఎంక్వయిరీలు చేసుకుని మరీ పెళ్లిళ్లు కుదుర్చుకుంటారు. అటువంటి పెళ్లిళ్లు కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా లేదా రద్దు అవుతంటాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి ఒమిక్రాన్ గా ముంచుకొస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారు ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి పెళ్లిళ్లపై పలు కంపెనీలు బీమాను అందిస్తున్నాయి. ‘వెడ్డింగ్ ఇన్సూరెన్స్’ పేరుతో పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి.

Read more : 5 States Elections : కరోనా పేషెంట్లు ఇంటినుంచే ఓటు వేయవచ్చు : కేంద్ర ఎన్నికల సంఘం

వివాహ బీమా అంటే ఏదైనా అనుకోని కారణాలతో వివాహం రద్దు అయిన, ఇతర నష్టం జరిగినా భీమా కంపెనీలు డబ్బులు చెలిస్తాయి. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి బీమా కట్టినా..ఆ పరిహారం పొందాలంటే కొన్ని నిబందనలను మాత్రం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వివాహ బీమా నాలుగు కేటగిరీల కింద వర్తిస్తుంది.

బాధ్యతల కవరేజ్(Coverage Of Liabilities) : పెళ్లి వేడుక సమయంలో జరిగే ప్రమాదాల వల్ల ఆస్తులకు నష్టం జరిగితే ఈ భీమా కవర్ చేస్తుంది.

రద్దు కవరేజ్ (Cancellation Coverage) : అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా పెళ్లి రద్దు కావడం వల్ల జరిగే నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది.
ఆస్తుల నష్టం (Property bamage Coverage): పెళ్లి వేడుకల సమయంలో యజమాని ఆస్తులకు ఏదైనా నష్టం కలిగితే ఇది వర్తిస్తుంది.

వ్యక్తిగత ప్రమాదం( Personal Accident): కొన్ని సార్లు పెళ్ళికి అని బయలుదేరుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులకు ఎదురయ్యే ఖర్చులకు ఈ బీమా వర్తిస్తుంది.

అలాగే..క్యాటరింగ్ కోసం, ఫంక్షన్స్ హాల్, హోటల్ రూమ్స్ బుకింగ్,వివాహ వేదిక, వివాహ ఆహ్వాన వెడ్డింగ్ కార్డ్ ప్రింటింగ్,మ్యూజిక్, భాజా భంజత్రీలు, డెకరేషన్స్ వంటివాటికి ఇచ్చిన అడ్వాన్స్ లు. పేపెంట్స్ వంటి నష్టాలను ఈ వెడ్డింగ్ బీమాతో కవర్ చేసుకోవచ్చు.

బీమా ప్రీమియం ఎంత? దాన్ని బట్టే వచ్చే పరిహారం..
పెళ్లి అనివార్య కారణం వల్ల ఆగిపోయినప్పుడు లభించే వివాహ బీమా అనేది మీరు ఎంత బీమా చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి బీమా ప్రీమియం అనేది మీకు ఇచ్చే హామీ మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు రూ.10 లక్షల వివాహ బీమా కావాలంటే, అప్పుడు మీరు రూ.7,500 నుంచి 15,000 ప్రీమియం చెల్లించాలి.