US Court : భార్యను పొడిచి చంపిన భారతీయుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు

భార్యను పొడిచి చంపిన భారతీయుడికి జీవిత ఖైదు విధించింది అమెరికా కోర్టు. కేరళకు చెందిన వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపినందుకు శిక్ష విధించింది.

Kerala man life imprisonmen : కాపురంలో వచ్చిన కలహాలు ఓ భర్త రాక్షసుడిగా మార్చాయి. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్తకు అమెరికాలో కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఎన్నో ఆశలతో అమెరికాలో కాపురం ఉంటున్న ఓ అమ్మాయిని కట్టుకున్న భర్తే కసితీరా పొడిచి చంపిన కేసులో అమెరికా ధర్మాసనం జీవిత ఖైదు శిక్ష విధించింది. 2020లో జరిగిన ఈ ఘటనపై విచారణ కొనసాగించిన ఫ్లోరిడా కోర్టు ఫిలిప్ మాథ్యూ అనే యువకుడికి జీవిత ఖైదు విధిస్తు జులై (2023)3న తీర్పునిచ్చింది.

కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ భార్య మెరిన్ తో కలిసి తన భార్య మెరిన్ జాయ్ కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో కాపురముండేవాడు. మెరిన్ ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లోని బ్రోవార్డ్ హెల్త్ ఆస్పత్రిలో జాయ్ నర్సుగా పని చేసేది. వీరి కాపురంలో తరచు గొడవలు జరుగుతుండేవి. అలా రోజులు జరుగుతున్నా వారి మధ్యా ఏమాత్రం సామరస్యం కుదిరేది కాదు. గొడవలు అంతకంతకు పెరిగాయి. ఈ క్రమంలో 2020 జులై 28న డ్యూటీకి వెళ్లింది మెరిన్. అంతకు ముందు రోజే వారిద్దరికి మధ్యా గొడవ తీవ్రస్థాయిలో జరిగింది. కానీ యథావిధిగా మెరిన్ మరునాడు డ్యూటీకి వెళ్లిపోయింది. డ్యూటీ ముగించుకుని తిరిగి సెల్లార్ లోని పార్కింగ్ ప్లేసుకు వచ్చిన మెరిన్ పై భర్త మాథ్యూ కత్తితో దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో కసితీరా పొడిచాడు.

విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి

తరువాత పారిపోయేందుకు యత్నించగా పోలీసులకు చిక్కాడు. దీనిపై కుసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. విచారణ చేయగా తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు.దీంతో అతడిని రిమాండ్ కు తరలించారు.ఈ కేసు విచారణ నాలుగేళ్లుగా కొనసాగింది. కేసు విచారణ అంతా అంటే నాలుగేళ్లపాటు భార్యను చంపిన నిందితుడిగా రిమాండ్ లోనే ఉన్నాడు. ఈక్రమంలో ఫ్లోరిడా కోర్టు మాథ్యూస్ ని నేరస్తుడిగా పరిగణిస్తు జీవిత ఖైదీ శిక్ష విధించింది.

ట్రెండింగ్ వార్తలు