Kim Jong Un : 20కిలోల బరువు తగ్గిన తర్వాత పరేడ్‌లో స్లిమ్‌గా కనిపించిన కిమ్..!

నియంత, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. 20కిలోల బరువు తగ్గిన తర్వాత మిలటరీ కవాతులో కిమ్ చాలా స్లిమ్ కనిపించాడు.

Kim Jong Un After 20 Kg Weight Loss, Seen At Parade : నియంత, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. మిలటరీ కవాతులో కిమ్ జోంగ్ ఉన్ చాలా స్లిమ్ కనిపించాడు. 20కిలోల బరువు తగ్గిన తర్వాత ఇలా కవాతులో కనిపించిన కిమ్.. జాతీయ టెలివిజన్ ప్రేక్షకులను ఆకర్షించాడు. ఎప్పుడూ చూసినా దుందుడు చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కిమ్.. ఇలా స్లిమ్ గా కనిపించి ప్రపంచాన్ని ఆకర్షించారు. 20 కిలోల బరువు తగ్గిన ఆయన కిమ్ ఫొటోలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈసారి తన తాత Kim Il Sung వ్యవస్థాపకుడు గుర్తుచేసేలా జుట్టును కత్తిరించుకుని మిలటరీ కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

అమెరికా ప్రెసిడెంట్ గా జో బైడెన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉత్తర కొరియా మొట్టమొదటి సైనిక కవాతులో పెద్ద కొత్త ఆయుధాలు ప్రదర్శించలేదు. కానీ కిమ్‌ మాత్రం సన్నగా స్లిమ్ గా కొత్త లుక్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలల తర్వాత కిమ్ ఇలా బరువు తగ్గి కనిపించడంపై మళ్లీ చర్చ మొదలైంది. లేత రంగు సూట్ ధరించిన కిమ్ కవాతులో ఎలాంటి ప్రసంగం చేయలేదు. నవ్వుతూ అందరికి వందనాలు చేశారు. వేలాది మంది గూస్-స్టెప్పింగ్ పారామిలిటరీ, పబ్లిక్ సెక్యూరిటీ దళాలు ప్యోంగ్యాంగ్‌లోని సెంట్రల్ కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ మీదుగా గంటకు పైగా కవాతు చేశారు. అదంతా బాల్కనీ నుంచి వీక్షిస్తూ కిమ్ చిరునవ్వుతో అందరికి వందనాలు చేస్తూ కనిపించారు.
Read More : Kim Jong Un : కిమ్ తలకు బ్యాండేజీ..ఇప్పుడిదే హాట్ టాపిక్

కిమ్ స్మోకర్.. దానికి తోడు అధిక బరువుతో చాలా ఏళ్లు ఇబ్బందులు పడ్డాడు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం విషయంలో అనేక పుకార్లు వినిపించాయి. ప్రత్యేకించి కిమ్ కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంది. అందుకే కిమ్ ఆరోగ్యం కూడా క్షీణించి ఇలా సన్నగా మారిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. అందుకే ఒకవేళ ఆయన అనారోగ్యానికి గురైతే తెర వెనుక ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమా? అనేది ట్రాక్ చేస్తున ఉత్తర కొరియా నేత కిమ్ గత కొన్ని నెలల్లో కనీసం 20 కిలోగ్రాములు (44 పౌండ్లు) తగ్గారు. ఇదే విషయాన్ని గత జులైలో దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడు, గూఢచారి ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు కవాతులో కిమ్ మరింత సన్నగా కనిపించాడు. చివరి సారిగా ఫిబ్రవరి తొలివారంలో బాహ్య ప్రపంచానికి కనిపించిన కిమ్.. తిరిగి నాలుగు నెలల తర్వాత జూన్ 6న బయటకు వచ్చారు.

37 ఏళ్ల నేత కిమ్.. దాదాపు 70 ఏళ్ల క్రితం తన తాత కిమ్ ఇల్ సంగ్ (Kim Il Sung) హెయిర్ స్టయిల్‌లో జుట్టు కట్ చేసుకుని ఇలా నివాళి అర్పించినట్లు కనిపించింది. ఏదిఏమైనా.. ఉత్తర కొరియా ఏళ్లుగా ఆహార కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కిమ్ మిలటరీ కవాతులో కావాల్సినంత మద్దతు కూడగట్టాలని కిమ్ భావిస్తున్నారని, అందుకే ఇలా సన్నగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారని ఇంటెలిజెన్స్ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Read More : Kim Jong Un : 20 కిలోల బరువు తగ్గిన కిమ్ జోంగ్ ఉన్

ట్రెండింగ్ వార్తలు