King Charles III: “బాహుబలి”లో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవం కంటే అద్భుతంగా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం.. 10 అంశాలివిగో

King Charles III: బాహుబలిలో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవాన్ని మనకు రాజమౌళి అత్యద్భుతంగా చూపించారు. ఇప్పుడు రాజుల కాలం లేదు కాబట్టి అటువంటి పట్టాభిషేక వేడుకను సినిమాల్లో తప్ప బయట ఎన్నడూ చూడలేమని అనుకుంటుంటాం.

King Charles III: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II (Queen Elizabeth) గత ఏడాది సెప్టెంబరులో కన్నుమూయడంతో బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-III (Charles III) ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ఇప్పటికే కింగ్ చార్లెస్-IIIగా పిలుస్తున్నారు. ఇప్పుడు రాజవంశ సంప్రదాయాలు, నిబంధనల ప్రకారం ప్రిన్స్ ఛార్లెస్ పట్టాభిషేకం (Coronation) జరగనుంది.

ఈ వేడుక మామూలుగా జరగదు. బాహుబలిలో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవాన్ని మనకు రాజమౌళి అత్యద్భుతంగా చూపించారు. ఇప్పట్లో రాజుల కాలం లేదు కాబట్టి అటువంటి పట్టాభిషేక వేడుకను సినిమాల్లో తప్ప బయట ఎన్నడూ చూడలేమని అనుకుంటుంటాం. ఆ సినిమాలో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవాన్ని మించి కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం జరగనుంది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇటువంటి పట్టాభిషేకాలు జరిగేవి. అప్పట్లో ఏ రీతిలో ఇటువంటి వేడుకలు జరిగేవో అచ్చం అలాగే ఇప్పుడు కూడా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. 2023, మే 6న ఈ అపురూప ఘట్టాన్ని చూసి మురిసిపోవచ్చు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రిన్స్ ఛార్లెస్-III పట్టాభిషేకం గురించి 5 ముఖ్యమైన అంశాలు..

cross of wales

* వేల్స్ చర్చి: ప్రిన్స్ ఛార్లెస్-III పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వేల్స్ చర్చి సమక్షంలో జరుగుతుంది.

coach

* గోల్డ్ స్టేట్ కోచ్: ఇంగ్లండ్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ చర్చిలో ఆ వేడుక తర్వాత ప్రిన్స్ చార్లెస్, ఆయన సతీమణి కామిల్లా పార్కెర్ బంగారు రథం “గోల్డ్ స్టేట్ కోచ్”లో బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు వెళ్తారు. ఈ “గోల్డ్ స్టేట్ కోచ్” 260 ఏళ్ల క్రితం నాటిది. 1831 నుంచి ఇప్పటివరకు బ్రిటిష్ రాజు, రాణిల పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపు కోసం దీన్ని వాడుతున్నారు.

* వెస్ట్‌మిన్‌స్టర్ చర్చి: బ్రిటిష్ రాజుల పట్టాభిషేక మహోత్సవ బాధ్యతలను వెస్ట్‌మిన్‌స్టర్ చర్చి 1066 సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. అంతేకాదు, ఆ రాజ కుటుంబాల వివాహ మహోత్సవ వేడుక బాధ్యతలనూ చూసుకుంటోంది. ఇప్పటివరకు 16 రాయల్ వెడ్డింగ్‌లను అంగరంగ వైభవంగా, అతిరథ మహారథుల సమక్షంలో నిర్వహించింది. సెప్టెంబరులో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II కన్నుమూసిన సమయంలో ఈ చర్చిలో గంటను మోగించిన విషయం తెలిసిందే. రాజకుటుంబాల సభ్యులు మృతి చెందితే గంటను మోగిస్తారు.

* కింగ్ ఛార్లెస్-III చిత్రం: కింగ్ ఛార్లెస్-III కిరీటం ధరించిన చిత్రాన్ని కొత్త శ్రేణి స్మారక నాణేలపై కనపడతాయి.

* కింగ్ ఛార్లెస్-III వయసు 73 ఏళ్లు. అత్యంత అధిక వయసులో ఆ బాధ్యతలు స్వీకరిస్తోన్న రాజుగా నిలుస్తున్నారు.

మరిన్ని విషయాలు…

* కోహినూర్‌ ఉన్న కిరీటం కింగ్ ఛార్లెస్-III సతీమణి కెమిల్లా ధరించే అవకాశం ఉంది. గతంలో బ్రిటన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లోనూ ఎలిజబెత్‌-II తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి అని ప్రకటన చేశారు. అయితే, పట్టాభిషేకంలో మాత్రం ఈ వజ్రాన్ని వినియోగించకూడదని ప్రతిపాదనలు ఉన్నాయి.

* కొన్ని నెలల క్రితమే ‘ఆక్సెషన్ కౌన్సిల్’ సభ్యులు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను రాజుగా ప్రకటించారు. దీంతో ఛార్లెస్ సతీమణి కెమిల్లా రాణి హోదాలో ఉన్నారు.

* 700 ఏళ్ల క్రితం నాటి ఓ సింహాసనం కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి తుదిమెరుగులు దిద్దుకుంది.

* కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి భారత్ నుంచి బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కు ఆహ్వానం అందింది.

* ప్రిన్స్‌ ఛార్లెస్‌ బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగుతున్నారు.

700 ఏళ్లనాటి కుర్చీలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం .. మెరుగులు దిద్దుకుంటున్న సింహాసనం ప్రత్యేకతలు

బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి బాలీవుడ్ బ్యూటీ అతిథి..

ప్రిన్స్ ఛార్లెస్ ఇకపై కింగ్ ఛార్లెస్.. బాధ్యతలు స్వీకరించిన ఎలిజబెత్‌-II కుమారుడు

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II మరణిస్తే.. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు ఏముంటాయి?

ట్రెండింగ్ వార్తలు