King Charles III..700 year old Chair : 700 ఏళ్లనాటి కుర్చీలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం .. మెరుగులు దిద్దుకుంటున్న సింహాసనం ప్రత్యేకతలు

ద గ్రేట్ బ్రిటన్ కింగ్‌ ఛార్లెస్‌ పట్టాభిషేకం కోసం 700 ఏళ్ల నాటి ముస్తాబవుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ కుర్చీలోనే మార్చి 6న రాజు పట్టాభిషేకం జరుగనుంది. ఈకుర్చీ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీకావు..

King Charles III..700 year old Chair : 700 ఏళ్లనాటి కుర్చీలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం .. మెరుగులు దిద్దుకుంటున్న సింహాసనం ప్రత్యేకతలు

King Charles III..700 year old Chair

UK King Charles III : రాచ కుటుంబాల్లో ప్రతీ అంశమూ ప్రత్యేకమే..రాచప్రాసాదాల్లో ఉండే ప్రతీ వస్తువుకు ఓ చరిత్ర ఉంటుంది. అటువంటిది సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ద గ్రేట్ బ్రిటన్ (United Kingdom)రాచ కుటుంబాల చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి వంశంలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన క్వీన్ ఎలిజబెత్ II గురించి చెప్పాలంటే తరగనని విశేషాలున్నాయి. ఆమె క్వీన్ ప్రేమ, తండ్రి మరణం తరువాత గ్రేట్ బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టిననాటినుంచి ఆమె జీవనశైలితోపాటు ఆమె మరణం కూడా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆమె మరణం తరువాత ఆమె కుమారుడు బ్రిటన్ కు ‘కింగ్’ అయ్యారు.

క్వీన్‌ ఎలిజబెత్‌ II (queen elizabeth II)మరణం తర్వాత.. కింగ్‌ ఛార్లెస్‌ (King Charles III) ఆ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం నప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) జరగాల్సి ఉంది. ఈ వేడుక మే 6 (2023)న జరగనుంది. ఈ వేడుక కోసం ఓ ప్రత్యేకమైన కుర్చీ (సింహాసనం) మెరుగులు దిద్దుకుంటోంది. బ్రిటన్ వాసులు రాజు పట్టాభిషేకం కోసం వేచి చూస్తున్నారు. ఈ వేడుక కోసం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబే ముస్తాబవుతోంది. ప్రతీది సంప్రదాయ పద్దతిలో ముస్తాబు అవుతున్నాయి.

Queen Elizabeth : 13 ఏళ్లకే ప్రేమలో పడిన క్వీన్ ఎలిజజెత్ .. పట్టుదలతో ప్రేమను గెలిపించుకున్న ధీర

ముఖ్యంగా 700ఏళ్ల నుంచి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీ కూడా పట్టాభిషేకానికి తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ కుర్చీకి చాలా ప్రత్యేకతలున్నాయి. రాజకుటుంబాల్లో ఏది జరిగినా సంప్రదాయం ప్రకారమే జరగాలి. అటువంటిది బ్రిటన్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకం కూడా అలాగే జరనుంది. ఈ వేడుకలో ముఖ్యంగా 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కుర్చీ ప్రఖ్యాతిగాంచిన నిపుణుల చేతుల్లో మెరుగులు దిద్దుకుంటోంది. హెన్రీ VIII నుంచి క్వీన్‌ విక్టోరియా, క్వీన్‌ ఎలిజబెత్‌ II వంటి ఎంతో మంది చక్రవర్తులు ఈ కుర్చీలోనే సింహాసనాన్ని అధిష్టించారు. ఈ కుర్చీ వారసత్వంగా వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ సుదీర్ఘకాలం పాలన చేశాక ఆమె మరణం తరువాత ఎన్నో ఏళ్ల తరువాత ఈ కుర్చీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఇదే కుర్చీలో కింగ్‌ ఛార్లెస్‌ III పట్టాభిషేకం జరిపించేందుకు సర్వ సిద్ధం చేస్తున్నారు.

కింగ్‌ ఎడ్వర్డ్‌ I (1239-1307) ఆదేశాల మేరకు ఈ పట్టాభిషేక కుర్చీని తయారు చేశారు. దీని కోసం స్కాట్లాండ్‌ రాజులు పట్టాభిషేకానికి ఉపయోగించే ప్రత్యేక రాయిని (Stone of Destiny) వినియోగించారు. ఈ రాయిని 1296లో స్కాట్లాండ్‌ నుంచి కింగ్‌ ఎడ్వర్డ్‌ తెప్పించారు. తర్వాత 1308 నుంచి పట్టాభిషేక కార్యక్రమాలలో ఈ కుర్చీని ఉపయోగించటం ప్రారంభమైంది. అలా అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ కుర్చీ ప్రదర్శన ఉంటుంది. అనంతరం 1399లో హెన్రీ IV పట్టాభిషేకం నుంచి దీనిని వినియోగంలోకి తెచ్చారు. తర్వాత హెన్రీ VIII నుంచి క్వీన్‌ విక్టోరియా, క్వీన్‌ ఎలిజబెత్‌ II వంటి ఎంతో మంది చక్రవర్తులు ఈ కుర్చీలోనే పట్టాభిషేకం పొందారు.

Queen Elizabeth II Dies : బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత

ఈ కుర్చీ ఎత్తు 2.05 మీటర్లు (6అడుగుల 9అంగుళాలు). కుర్చీపై భాగంలో అరుదైన రాయిని అమర్చారు. కింద బేస్‌ లో రెండువైపులా రెండు సింహాల విగ్రహాలు ఠీవీగా ఉంటాయి.ఈకుర్చీ బంగారు పూతతో డిజైన్‌లూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. అత్యంత అరుదుగా వినియోగించే ఈ కుర్చీ 700 కావటంతో కాస్త కళతప్పింది. దీంతో దీనికి మెరుగులు దిద్దుతున్నారు.
మధ్యయుగం నాటి ఈ కుర్చీపై ఉన్న మురికిని స్పాంజ్‌లు, కాటన్‌ స్వాబ్‌లతో తొలగిస్తున్నారు నిపుణులు.

ఆ కుర్చీ తిరిగి బంగారు పూత పూయవచ్చు. కానీ పురాతన కాలంనాటి సంప్రదాయంగా తయారైన కుర్చీలోనే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం జరగాలి. అందుకే ఆనాటి బంగారు పూత చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కుర్చీ పెళుసుగా మారింది. దీంతో దానికున్న ప్రత్యేకతలు..చరిత్ర ఏమాత్రం దెబ్బతినకుండా నిపుణులు అత్యంత జాగ్రత్తగా దానికి మెరుగులు దిద్దుతున్నారు. ఈ కుర్చీని పట్టాభిషేకానికి సిద్ధం చేయటానికి చాలా జాగ్రత్తలు తీసుకంటున్నామని రాజభవనానికి చెందిన పెయింటింగ్‌ నిర్వాహకురాలు క్రిస్టా బ్లెస్లీ తెలిపారు. కుర్చీకి ఉండే చిన్నపాటి పొరకూడా పాడవవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సిద్ధం చేస్తున్నామన్నారు.

Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల ఊరేగింపు‌ను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన బ్రిటన్ ప్రజలు.. ఫొటో గ్యాలరీ