Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II మరణిస్తే.. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు ఏముంటాయి?

బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్‌-II. బ్రిటన్ రాణిగా ఆమె 25 ఏళ్ళ వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. ఆమె మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II మృతి చెందితే దేశంలో తీసుకోవాల్సిన చర్యలపై ‘‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’’ పేరిట అధికారుల ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. రాణి ఎలిజబెత్‌-II మృతి చెందారన్న విషయాన్ని ప్రకటించడం, సంతాప దినాలు, ఆమె అంత్యక్రియలు వంటి అంశాలే కాకుండా, ఆమె మరణిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు రావచ్చు, వాటిని అదుపుచేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశాలపై కూడా ప్రణాళికలు వేసుకుంటారు.

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II మరణిస్తే.. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు ఏముంటాయి?

Queen Elizabeth II

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II (96) ఆరోగ్య పరిస్థితిపై ఆ దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తూ ఒకవేళ ఎలిజబెత్‌-II మరణిస్తే కొన్ని రోజుల పాటు బ్రిటన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఎలిజబెత్‌-2 మరణిస్తే అనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బ్రిటన్ లో తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి అధికారులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాతే ఆమె మరణంపై ప్రకటన చేస్తారు.

ఆపరేషన్ లండన్ బ్రిడ్జి: బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్‌-II. బ్రిటన్ రాణిగా ఆమె 25 ఏళ్ళ వయసు(1952) నుంచి కొనసాగుతున్నారు. ఆమె మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II మృతి చెందితే దేశంలో తీసుకోవాల్సిన చర్యలపై ‘‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’’ పేరిట అధికారుల ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. రాణి ఎలిజబెత్‌-II మృతి చెందారన్న విషయాన్ని ప్రకటించడం, సంతాప దినాలు, ఆమె అంత్యక్రియలు వంటి అంశాలే కాకుండా, ఆమె మరణిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు రావచ్చు, వాటిని అదుపుచేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న అంశాలపై కూడా ప్రణాళికలు వేసుకుంటారు.

రాణి ఎలిజబెత్‌-II మృతి చెందారన్న విషయాన్ని ప్రకటించడానికి మొదట కోడ్ పదాలు వాడతారు. రాణి ఎలిజబెత్‌-II మృతి చెందారన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపాక.. ఆ విషయాన్ని ఎలిజబెత్‌-II ప్రైవేటు సెక్రటరీ మొదట ప్రధాని లిజ్ ట్రస్ కు ఈ విషయాన్ని తెలుపుతారు. అయితే, ఆమె మృతి చెందారంటూ నేరుగా చెప్పరు. ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో చెబుతారు. అనంతరం బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయం కామన్వెల్త్ దేశాల్లోని ప్రభుత్వాలకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాతే, ఎలిజబెత్‌-II మృతి చెందారన్న వార్తను అన్ని మీడియా సంస్థలకు ఒకేసారి తెలుపుతారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ గేట్లకు సాంప్రదాయం ప్రకారం నోటీసులు అంటిస్తారు.

ఆ రాజ కుటుంబ వెబ్ సైట్లోనూ ఈ వార్తను పోస్ట్ చేస్తారు. బ్రిటిష్ ప్రధాన వార్తా సంస్థలు అన్నీ ఈ వార్తలనే ప్రధానంగా ప్రసారం చేస్తాయి. ఎలిజబెత్‌-II మరణవార్తనే అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తాయి. కొన్ని వార్తా సంస్థలు ఇప్పటికే ఎలిజబెత్‌-IIకు సంబంధించిన అన్ని కథనాలను రాసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలిజబెత్‌-II మరణవార్తను ప్రకటించినప్పటి నుంచే బ్రిటిష్ ఆచార, సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారు. అన్ని చర్చుల్లో గంటలు మోగిస్తారు. ముఖ్యంగా వెస్ట్‌మిన్‌స్టర్ చర్చి గంటను రాజకుటుంబాల సభ్యులు మృతి చెందితే మోగిస్తారు.

పది రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తారు. ఎలిజబెత్‌-II మృతి చెందిన 10 రోజుల వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించరు. 10 రోజుల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. ఆ సమయంలో రాణి పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతారు. అలాగే, అదే సమయంలో ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ బ్రిటన్ పర్యటన ఉంటుంది. దేశ ప్రజలను ఆయన కలుస్తారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ కు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటారు. అలాగే, సెయింట్‌ పాల్‌ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఎలిజబెత్‌-II కుమారుడు, వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశం ఉంది.

ఒకవేళ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-II విదేశాల్లో మృతి చెందితే ఆమె పార్థివ దేహాన్ని తీసుకురావడానికి రాయల్ ఎయిర్ ఫోర్స్ ను పంపి, సాంప్రదాయం ప్రకారం తీసుకొస్తారు. లండన్ లో కాకుండా ఇంగ్లండ్ లోని ఇతర ప్రాంతాల్లో ఆమె మృతి చెందితే ఓ కారులో ఆమె పార్థివదేహాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ కు తీసుకు వస్తారు. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే, అక్కడ ఆమె తుది శ్వాస విడిస్తే క్లిష్టతర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

స్కాటిష్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారు. బల్మోరల్ కోటకు ఎలిజబెత్‌-II ప్రతి వేసవికాలంలో వెళ్ళేవారు. ఎలిజబెత్‌-II మృతి చెందిన తర్వాత 10 రోజుల బ్రిటన్ పర్యటనకు వెళ్ళిన చార్లెస్ తిరిగి లండన్ చేరుకున్నాక ఎలిజబెత్‌-II పార్థివదేహాన్నిబకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి యూకే పార్లమెంటులోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ కు తరలిస్తారు. 2002లో ఎలిజబెత్‌-II తల్లి మరణించిన సమయంలో అంత్యక్రియల్లో 1,600 ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. ఎలిజబెత్‌-II మృతి పట్ల ప్రజలు నివాళులు అర్పించడానికి వెస్ట్‌మిన్‌స్టర్ కు ప్రజలకు కొన్ని రోజుల పాటు అనుమతిస్తారు. ఎలిజబెత్‌-II అంత్యక్రియలు జరిగే రోజున యూకే వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటిస్తారు.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్