ఉగ్రవాదులకు ఆర్థిక సాయం…హఫీజ్ కు జైలు శిక్ష ఖరారు చేసిన పాక్

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2020 / 11:16 AM IST
ఉగ్రవాదులకు ఆర్థిక సాయం…హఫీజ్ కు జైలు శిక్ష ఖరారు చేసిన పాక్

Updated On : February 12, 2020 / 11:16 AM IST

ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా లీడర్ హఫీజ్ సయూద్ ను బుధవారం(ఫిబ్రవరి-12,2020) రెండు టెర్రర్-ఫైనాన్సింగ్(ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం) కేసుల్లో దోషిగా తేల్చింది లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు. ఒక్కొక్క కేసులో 15వేల రూపాయల ఫైన్ తో పాటుగా హఫీజ్ కు ఐదున్నరేళ్లు జైలు శిక్ష ఖ‌రారుచేసింది.

ఫిబ్రవరి-6,2020న లాహోర్‌ కు చెందిన యాంటీ టెర్ర‌రిజం కోర్టు విచార‌ణ‌ను పూర్తి చేసింది. తీర్పును రిజ‌ర్వ్‌లో ఉంచిన జ‌డ్జి హ‌ర్ష‌ద్ హుస్సేన్ భుట్టా.. ఇవాళ హ‌ఫీజ్‌కు శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేసుల‌ను ఒకే ద‌గ్గ‌ర‌కు చేర్చి.. తీర్పును ఇవ్వాలంటూ హ‌ఫీజ్ ఇటీవ‌ల ఏటీసీ కోర్టును కోరారు.  ఏటీఏ సెక్ష‌న్ 11-ఎఫ్‌(2), 11-ఎన్ కింద హ‌ఫీజ్‌ను దోషిగా తేల్చింది కోర్టు.

అయితే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (జైలు శిక్షను తగ్గించడం) లోని సెక్షన్ 382-బి యొక్క ప్రయోజనాన్ని కూడా కోర్టు హఫీజ్ సయూద్ కు మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సయీద్‌ను కస్టడీలో ఉంచాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

హఫీజ్ పై టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులను లాహోర్ మరియు గుజ్రాన్వాలా కౌంటర్-టెర్రరిజం డిపార్ట్మెంట్ (CTD) చాప్టర్స్ నమోదు చేశాయి. సీటీడీ గుజ్రాన్‌వాలా చాఫ్టర్ దాఖలు చేసిన కేసు మొదట్లో గుజ్రాన్‌వాలా ఏటీసీలో విచారణ జరుపుతున్నప్పటికీ లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు లాహోర్‌కు  షిఫ్ట్ అయింది. రెండు కేసుల విచారణ సందర్భంగా కోర్టు 23 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డ్ చేసింది.

గతేడాది జులైలో లాహోర్ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సమయంలో హఫీజ్ ను సీటీడీ అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు, జూలై 2019 లో లాహోర్, గుజ్రాన్‌వాలా, ముల్తాన్, ఫైసలాబాద్ మరియు సర్గోధాలోని సీటీడీ పోలీస్ స్టేషన్లలో జేడీయూ లీడర్లు సయీద్ సహా నాయబ్ ఎమిర్ అబ్దుల్ రెహమాన్ మక్కిపై 23 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబడ్డాయి.

సీటీడీ ప్రకారం…అల్-అన్ఫాల్ ట్రస్ట్, దవతుల్ ఇర్షాద్ ట్రస్ట్, మువాజ్ బిన్ జబల్ ట్రస్ట్, వంటి నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ట్రస్టుల ద్వారా సేకరించిన భారీ నిధుల నుండి జేయూడీ ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్లను గతేడాది ఏప్రిల్ లో సీటీడీ బ్యాన్ చేసింది. పూర్తి ఇన్వెస్టిగేషన్ సమయంలో జేయూడీ,దాని అగ్రనాయకత్వంతో ఆ ఆర్గనైజేషన్లకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.