Actor case : జంతిక తిన్న నటికి బ్రెయిన్ డ్యామేజ్..రూ. 220 కోట్ల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు

Las vegas family awarded Rs.220 crore : ‘మన టైమ్ బాగుండకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది’ అని పెద్దలు చెప్పిన సామెత. కానీ జంతిక తిన్న ఓ మహిళా మోడల్, నటికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని దానికి కారణమైనవారికి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నదరు నటి కుటుంబానికి 29.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.220 కోట్లు) పరిహారంగా చెల్లించాలని లాస్‌వేగాస్‌లో ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది..!

వివరాల్లోకి వెళితే..అమెరికాలోని లాస్‌వేగాస్‌కు చెందిన 27 ఏళ్ల మోడల్, వర్ధమాన నటి అయిన చెండెల్ గియాకలోన్ 2013లో పీనట్ బటర్‌ (peanut butter )కలిపిన ప్రెట్‌జెల్‌ (అంటే జంతికలాంటి స్నాక్ ఐటెమ్) ను కొరికి తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్‌కు గురైంది. అలెర్జీ రియాక్షన్‌కు గురైన నటి చెండెల్ గియాకలోన్‌కు లాస్‌వేగాస్‌లోని అంబులెన్స్ సర్వీస్ చికిత్స అందించింది. ఈ చికిత్సలో అంబులెన్స్ సిబ్బంది చేసిన చిన్న తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వాళ్లు చేసిన తప్పిదం కారణంగా ఆమె కుటుంబం కోర్టును ఆశ్రయించింది.

బాదితురాలైన గియాకలోన్ తరపు న్యాయవాది క్రిస్టియన్ మోరిస్ తన వాదనలు వినిపిస్తూ ఆ రోజు మెడిసిన్ స్టేషన్ నడుపుతున్న మెడిక్‌వెస్ట్ అంబులెన్స్ చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మెదడుకు కొన్ని నిమిషాలపాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని కోర్టుకు తెలిపి..ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందనీ దానికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని తన క్లైంట్ కు న్యాయం చేయాలని కోరారు.

తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్‌‌‌కు అడ్రినలిన్ చికిత్స అయిన ఐవీ ఎపినెఫ్రిన్ ఆ రోజు డ్యూటీలో ఉన్న ఇద్దరు డాక్టర్ల వద్దా లేదని..అది వారి నిర్లక్ష్యమని ఇది ఓ పేషెంట్ పట్ల నిర్లక్ష్యమేనని క్రిస్టియన్ మోరిస్ కోర్టుకు తెలియజేశారు. తీవ్రమైన అలర్జీ (అనాఫిలాక్సిస్)కు ఐవీ అవసరమైతే ఇంట్రాముస్కలర్ ఎపినెఫ్రిన్‌ను ఇచ్చారని ఆరోపించారు.

ఆ మందు ధర 2.42 డాలర్లు మాత్రమేనని, తన క్లయింట్‌కు అయిన మెడికల్ ఖర్చులు, మానసిక వేదనకు 60 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న జ్యూరీ బాధిత కుటుంబానికి 29.5 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని అంబులెన్స్ సర్వీస్‌ను ఆదేశించింది.

కాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై మెడిక్‌వెస్ట్ అసంతృప్తిని వెల్లడించింది.  తమ తప్పిదం ఏమీ లేదంటూ.. ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. గియాకలోన్ ఎప్పుడూ స్పృహ కోల్పోలేదని అటార్జీ విలియం డ్రురీ కోర్టుకు తెలిపారు. కాగా, జ్యూరీ తీర్పుపై గియాకలోన్ తండ్రి జాక్ సంతోషం వ్యక్తం చేశారు. 8 ఏళ్లపాటు తాము అనుభవించిన బాధలకు ఫుల్‌స్టాప్ పడిందన్నారు. ఇప్పటికైనా మెడిక్‌వెస్ట్ తన తీరు మార్చుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు