Lassa
Lassa Fever : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. కొత్త కొత్త వేరియంట్ లు ప్రజలను భయపెట్టిస్తున్నాయి. పలు దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, మరణాలు సంభవిస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా మరొక కొత్త వేరియంట్ వణికిస్తోంది. అదే లస్సా ఫీవర్. దీని బారిన పడిన ముగ్గురు యూకేలో చనిపోయారనే వార్తలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడుతున్నారు. 2009లో యూకేలో రెండు లస్సా కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన లక్షణాలు ఉంటే.. 14 రోజుల్లో చనిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read More :కరోనాతో చనిపోయిన తర్వాత మృతదేహంలో వైరస్
లస్సా ఫీవర్ ను గుర్తిచండం చాలా కష్టమని, వ్యాధిని ముందుగానే గుర్తిస్తే.. చికిత్స చేయడం సులభమని వైద్యులు వెల్లడిస్తున్నారు. దీనిపై డబ్యూహెచ్ వో స్పందించింది. వ్యాధి సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండం లేదని, కొద్ది మందిలో జ్వరం, ఛాతి నొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పితో పాటు తలనొప్పి ఉంటుందంటున్నారు. వాంతులు, విరేచనాలు, దగ్గు, కడుపునొప్పి ఇతరత్రా లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. జంతువుల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎలుకల్లో ఈ వ్యాధి ఉంటుందని పేర్కొంటున్నారు.
Read More : Antibodies : వ్యాక్సిన్ తరువాత వ్యాయామంతో….మెరుగైన రోగనిరోధక కణాలు
ఈ వైరస్ బారిన పడిన ఎలుకలు ఆహార పదార్థాలపై మలమూత్ర విసర్జన చేసినప్పుడు ఆ ఆహారాన్ని తీసుకున్న మనుషులకు లస్సా వైరస్ బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. ప్రతి సంవత్సరం లక్ష నుంచి 3 లక్షల మందికి లస్సా ఫీవర్ బారిన పడుతుంటారని, సీడీసీ అంచనా వేసింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని, లస్సా జ్వరం రెండు నుంచి 21 రోజుల పాటు ఉంటుందని పేర్కొంటున్నారు. 1969లో నైజీరియాలోని లస్సానే అనే ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. దీంతో దీనికి లస్సా వైరస్ అనే పేరు పెట్టారు. దీనికి రిబావిరిన్ అనే యాంటీ వైరల్ డ్రగ్ ఇస్తారని, ముందుగానే గుర్తిస్తే ఈ డ్రగ్ బాగానే పని చేస్తుందని వెల్లడిస్తున్నారు.