Covid In US : అమెరికాలో మళ్లీ కొవిడ్ ముప్పు…సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరిక

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు....

Covid In US : యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు. అంతకుముందు వారం 6,444 మంది కరోనా బారిన పడ్డారు. (Covid hospitalisations spike in US) కొవిడ్ మహమ్మారితో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది. (Covid In US)

California airport : కాలిఫోర్నియాలో హ్యాంగర్‌ను ఢీకొన్న చిన్న విమానం…ముగ్గురి మృతి

జులై 21వతేదీ నాటికి కొవిడ్ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. (Health agency warns) మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో లాస్ ఏంజిల్స్‌లో ప్రజలు మాస్క్‌లు ధరించి కిరాణా దుకాణంలో షాపింగ్ చేస్తుండటం కనిపించింది. ఆరు, ఏడు నెలల స్థిరమైన క్షీణత తర్వాత,కరోనా మళ్లీ పుంజుకోవడం ప్రారంభించిందని అట్లాంటాలోని సీడీసీ కోవిడ్ సంఘటన మేనేజర్ డాక్టర్ బ్రెండన్ జాక్సన్ చెప్పారు.

Air India flight : ఎయిర్ ఇండియా విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

గత కొన్ని వారాలుగా కరోనా కేసులు ప్రారంభం చూశామని, ఈ వారంలో కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని డాక్టర్ బ్రెండన్ పేర్కొన్నారు. వేసవికాలంలో కరోనా ముప్పు మళ్లీ ప్రారంభమైందని లాంగోన్ మెడికల్ సెంటర్‌లో మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ సీగెల్ చెప్పారు. హైరిస్క్ గ్రూప్ లో వారికి ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ బూస్టర్ డోస్ వేసుకోవాలని డాక్టర్ సూచించారు.

ట్రెండింగ్ వార్తలు