Like Lord Ram And Sita Defeated Ravana”: UK PM Boris Johnson’s : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన దీపావళి సందేశం వైరల్ అవుతోంది. భారతీయ సంప్రదాయంలో దీనిని పెద్ద వేడుకగా నిర్విహిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..బోరిస్ జాన్సన్ ఈ పండుగను ప్రస్తావించారు. భారతీయ ప్రజలు చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు.
బ్రిటన్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. రెండోసారి లాక్ డౌన్ విధించారు ప్రధాని. ఈ నేపథ్యంలో శుక్రవారం లండన్ లోని 10వ డౌనింగ్ స్ట్రీట్ లో ఐ గ్లోబల్ దివాలి ఫెస్ట్ 2020 పేరిట జరుగుతున్న కార్యక్రమాన్ని బోరిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు సందేశాన్ని వినిపించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఐకమత్యంతో వైరస్ పై పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, కాంతిని విరజిమ్ముతూ, చీకట్లను పారద్రోలేలా..చెడుపై మంచి విజయం సాదించినట్లుగా..అజ్ఞానంపై జ్ఞానం అధిపత్యం చూపించిన విధంగా మనం పోరాడాల్సి ఉంటుందని పిలుపునిచ్చారాయన.
రాముడు, భార్య సీతతో కలిసి రావణుడిని ఓడించి తిరిగి భారతదేశానికి చేరుకున్న సమయంలో దేశ ప్రజలు కొన్ని కోట్ల దీపాలు వెలిగించి తమ విజయాన్ని చూపించారని తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టిన ఆంక్షల నడుమ భారతీ ప్రజలు పండుగలను జరుపుకోవడం అభినందనీయమని, రానున్న దీపావళి వేడుకలను కూడా ఇదే తరహాలో జరపుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. దివాళి ఫెస్ట్ కు బ్రిటన్ లోని భారతీయులంతా..ఇళ్లలోనే ఉండి..వర్చువల్ వీడియో ద్వారా పాల్గొనాలని కోరుతున్నట్లు బోరిస్ తెలిపారు.