రేప్ బాధితురాలు అబద్దాలు చెప్పే జంతువు అన్న మహిళా మంత్రి : అదే నోటితోనే క్షమాపణలు చెప్పి నష్టపరిహారం చెల్లించిన వైనం

ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ మంత్రి లిండా రేనాల్డ్స్‌..అత్యాచార బాధితురాల‌కి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు. సాక్షాత్తూ ర‌క్ష‌ణ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న బ్రిట్నీ హిగ్గిన్స్ అనే మ‌హిళా ఉద్యోగి ఇటీవ‌ల తనపై అత్యాచారం జరిగిందని ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లితే పట్టించుకోలేదని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

rape victim a lying cow  : ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ మంత్రి లిండా రేనాల్డ్స్‌..అత్యాచార బాధితురాల‌కి క్షమాపణ చెప్పి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు. సాక్షాత్తూ ర‌క్ష‌ణ కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న బ్రిట్నీ హిగ్గిన్స్ అనే మ‌హిళా ఉద్యోగి తనపై అత్యాచారం జరిగిందని ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లితే పట్టించుకోలేదని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

2019లో త‌మ ఆఫీసులోని మ‌రో అధికారే త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు హిగ్గిన్స్ ఇటీవ‌ల ఓ సంచ‌ల‌న ఆరోప‌ణ చేసింది. అయితే ఆ బాధితురాలు హిగ్గిన్స్‌పై ర‌క్ష‌ణ మంత్రి లిండా ఓ సంద‌ర్భంలో ఆరోపించారు. ఆమె చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా ర‌క్ష‌ణ మంత్రి లిండా రేనాల్డ్స్ తీవ్రంగా స్పందించారు. తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. సదరు ‘‘అత్యాచార బాధితురాలు అబద్దాలు చెప్పే జంతువు‘ అంటూ లిండా రేనాల్డ్స్ వ్యాఖ్య‌లు చేశారు.

ఈక్రమంలో త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు మంత్రి లిండా పేర్కొన్నారు. ఇదే కేసులో హిగ్గిన్స్‌కు ర‌క్ష‌ణ మంత్రి లిండా న‌ష్ట ప‌రిహారం చెల్లించారు. ప్ర‌స్తుతం మంత్రి లిండా రేనాల్డ్స్ సిక్ లీవ్‌లో ఉన్నారు. సోష‌ల్ మీడియాలో ఆమె త‌న క్ష‌మాప‌ణ పోస్టు చేశారు. మంత్రి చెప్పిన క్ష‌మాప‌ణ‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు హిగ్గిన్స్ కూడా ఏస్కప్ చేసారు. కానీ అత్యాచార బాధితులు ఆశ్ర‌యం పొందే సంస్థ‌లో చేరేందుకు త‌న‌కు ఆర్థిక స‌హాయం కావాల‌ని కోరింది. హిగ్గిన్స్ కోరిన‌ట్లే మంత్రి ఆమెకు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించారు.

సదరు బాధితురాలు అత్యాచారం జరిగిన తరువాత ఉన్నతాధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయాన్ని బైటకు చెబితే తన కెరీర్ ఎక్కడ చెడిపోతుందనని ఈ విషయాన్ని బైటపెట్టలేదని కూడా ఆమె తెలిపారు. ఆ ‘రేపిస్టు’ పేరును మాత్రం ఆమె చెప్పలేదు. ఆమె చేసిన ఆరోపణలు పోలీసులు కూడా ధృవీకరించారు.

కాగా.. దీనిపై స్పందించినప్రధాని స్కాట్ మారిసన్ అత్యాచార బాధితురాలికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. పార్లమెంటు వంటి చోట్ల, ఇతర ప్రాంతాల్లో మహిళల భద్రత, రక్షణకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. వర్క్ ప్లేస్ లో వచ్ఛే ఈ విధమైన ఫిర్యాదుల సమీక్షకు ప్రధానమంత్రి కార్యాలయం లో కేబినెట్ అధికారి అయిన స్టెఫానీ ఫాస్టర్ ఇక పై విచారిస్తారన్నారు. జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.